Home Health బలపాలు తినడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి?

బలపాలు తినడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి?

0

మట్టి తినడం, బలపాలు, చెక్ పీస్ లు తినడం చిన్న పిల్లల్లోని కాదు పెద్ద వాళ్ళలోనూ చూస్తుంటాం. కొంతమందికి రెగ్యులర్ గా చాక్ పీసెస్, బలపాలు తినాలనిపిస్తుంటుంది. దీనికి కారణం పీకా అనే ఓ సమస్య ఉన్నట్లు. దీనికి గనుక సరిగ్గా ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే భవిష్యత్‌లో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి దారి తీయొచ్చు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

health problems caused by eating fortified foodsపీకా అనే సమస్య ఉన్నవారు బలపాలు, చాక్‌పీస్‌లు తింటారు. వీరికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ గా చెప్పొచ్చు. ఓసీడీ ఉన్నవారూ, పోషకాహార లేమి తో బాధపడుతున్నవారూ, ప్రెగ్నెంట్ గా ఉన్న వారూ కూడా ఇలా తింటారు. ఒక్కోసారి బాడీ లో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పీకా వస్తుంది.

చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి:

1. దంతాలు పాడవ్వడం

2. జీర్ణ సమస్యలు

3. మలబద్ధకం

4. లెడ్ పాయిజనింగ్

5. కడుపులో నులిపురుగు పెరగడం

6. ఆకలి లేకపోడం

ఇలా మట్టి, శుద్ధ తినడాన్ని మృద్బక్షణ అని అంటారు. ఇది సాధారణంగా రక్త క్షీణత, అజీర్తి, నులి పాములు, ఏలిక పాములు చిన్నపిల్లల కడుపులో ఉన్నపుడు ఈ లక్షణం వస్తుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి సుద్ధ, మట్టి, నామసుద్ధ, బలపాలు తినాలనిపిస్తుంది. అది అంతటితో ఆగదు సరికదా.. ఇతర వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని నిరోధించేందుకు మందులు వాడాలి. అవేంటో చూద్దాం.

కాచిన సింధూరం 50 గ్రా, కాంతలోహ 50 గ్రాములను తేనెతో కలిపి రెండు పూటలా వేయాలి. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇందులో కూడా తీవ్రత ఉంటుంది. ఏలికపాములు, నులి పురుగులు ఉన్నట్లయితే ఒక్క గ్రాము విడంగాది చూర్ణం, 50 గ్రాముల కాసిన సింధూరం తేనేతో కలిపి రెండు పూటలా తినిపించాలి. పండ్ల రసాలు, మామూలు భోజనం, పౌష్టికాహారం ఇవ్వాలి.

Exit mobile version