Home Health తెల్లమచ్చలు పోవడానికి సులువైన ఇంటి చిట్కాలు

తెల్లమచ్చలు పోవడానికి సులువైన ఇంటి చిట్కాలు

0
Easy home remedies for whiteheads

శరీరంపై తెల్లని రంగులో కనిపించే మచ్చలను ల్యుకోడెర్మా అంటారు. జన సామాన్యంలో బొల్లి మచ్చలనే తెల్లమచ్చలుగా వ్యవహరిస్తారు. చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల బొల్లి వ్యాధి కలుగుతుంది. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి.

చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం… టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల క్షీణించడం జరుగుతుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది.

ఈ వ్యాధిని గుర్తు పట్టడం కష్టమేమీ కాదు. మొదట్లో చర్మంపైన గులాబీ రంగులో కాని, తెలుపు రంగులో కాని అస్పష్టమైన మచ్చలు కనిపిస్తాయి. ఇవి క్రమంగా లేదా హఠాత్తుగా పూర్తి తెలుపు రంగు మచ్చలుగా మారుతాయి. సామాన్యంగా ఈ మచ్చలపైన దురద ఉండదు. పొట్టు కూడా లేవదు. కాకపోతే కొంతమందిలో మాత్రం ఎండలోకి వెళితే మచ్చలపైన దురద అనిపించవచ్చు. తెల్ల మచ్చలపైన తాకినప్పుడు స్పర్శ తెలుస్తుంది.

మోచేతులు, మోకాళ్లు, చంకలు మొదలైన శరీర భాగాల మడతల్లో, అరచేతుల్లో, పెదవులపై వచ్చిన బొల్లి మచ్చలు అంత త్వరగా తగ్గవు. ఇవి పూర్తిగా పోవాలంటే రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ తెల్లటి మచ్చల వల్ల ఎటువంటి శారీరక బాధలు ఉండవు కానీ మానసిక ఆందోళన ఉంటుంది. ఇటువంటి మచ్చలు పోయేందుకు ఈ చక్కగా పనిచేస్తాయి.

->వేపకాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా నూరుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు అరతులం చొప్పున తింటే నలభై రోజుల్లో తెల్లమచ్చలు తగ్గుతాయి.

->పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని తులసి ఆకుల రసంతో కలిపి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడుతాయి.

->తంగేడు చెట్టు పట్టను ఆవుపాలలో దంచి తెల్లమచ్చల మీద రాస్తే తగ్గుతాయి.

 

Exit mobile version