Home Entertainment Everything About Komuram Bheem, Story Of A Tribal Fighter That ‘NTR’s Bheem’...

Everything About Komuram Bheem, Story Of A Tribal Fighter That ‘NTR’s Bheem’ in RRR Is Based On

0

RRR మూవీ లో జూ. ఎన్టీఆర్ కొమురం భీం ఇన్స్పిరేషన్ పాత్రలో కనిపిస్తారు అని దర్శకులు రాజమౌలి చెప్ప్పిన దగ్గరి నుండి ఈ సినిమా పైన, ఈ సినిమాలో ఎన్టీఆర్ చేయబోయే పాత్ర పైన చాల ఉత్కంఠ నెలోకొంది…అస్సలు ఎవరు ఈ కొమురం భీం ? ఈయన స్టోరీ మన జక్కన్న ని ఎందుకు అంతలా ఇన్స్పిరె చేసింది ? ఈయన ఉత్తినే గడ్డ కోసం పోరాటం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

Whatsapp Image 2020 10 22 At 12.02.10 Pmఆదివాసీల పైన నిజం నవాబుల నిరంకుశ పాలనా పైన ఉద్యమించి…వారి గుండెల్లో గుబులు పుట్టించాడు:

కొమురం భీమ్ గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్, సోంబాయి దంపతులకు 1901 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు. భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు.

నిజాం పాలనలో ఆదివాసీలు అడవిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసేవారు. రాత్రింబవళ్లు కష్టపడి పంటను పండించేవారు. గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు దట్టమైన అడవిలో భూములను సాగుచేసుకున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగ్లాత్ వాళ్లు గొడవ చేసేవాళ్లు. తిరగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టే వాళ్లు. ఇలాంటి సంఘటనలే కొమురం భీమ్‌ను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలకొట్టాడు కొమరం భీం. ఆ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చని పోయాడు. దీంతో భీం మహారాష్ట్రలోని బల్లార్షా వైపు పారిపోయాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీ పని చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. కొత్త కొత్త పంటలు పండించడం.. వాటిని మార్కెట్‌లో మంచి ధరకు అమ్మడం తెలుసుకున్నాడు. తరువాత భీం తల్లిదండ్రులు ఉంటున్న కాకన్‌ ఘాట్‌కు వచ్చాడు. ఆ గ్రామంలోని గిరిజనుడు లచ్చుప వద్ద పనికి కుదిరాడు. ఆ సమయంలోనే భీంకు సోంబాయితో పెళ్లి జరిగింది.

ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబాద్ తహసిల్దార్‌కు కట్టేవారు. కొమురం భీం అప్పటి తహసిల్దార్‌తో మాట్లాడి లచ్చుపకు చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పరిచాడు. దీంతో అటవీ అధికారులు భీం మీద కేసుపెట్టారు. ఓ చౌకిదార్, అమీన్, తొమ్మిది మంది పోలీసులు వచ్చి భీం ఇంటిని సోదా చేయగా ఏమీ దొరకలేదు. భీంకు కోపం వచ్చి వాళ్లపై తిరగబడ్డాడు. దీంతో అధికారులు భీంపై కేసుపెట్టారు.

కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం భీమ్ ని హతమార్చాయి:

భీంను, ఆయన అనుచరులను ఎదుర్కొనేందుకు 1940 సెప్టెంబరు 1న నిజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులు ఉన్న 12 గ్రామాలను చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన ఘర్షణలో కొమురం భీంతోపాటు 11 మంది గిరిజనులు చనిపోయారు. భీం నాయకత్వంలో గిరిజనులు పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభువును కదిలించింది. వారి సమస్యల పరిష్కారానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించటానికి ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్‌ డార్ఫ్‌ను నియమించింది నిజాం సర్కార్‌. 1940 అక్టోబర్ 27 న కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి.

జల్..జంగిల్…జంగ్ అనే నినాదకర్త…ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక మన కొమురం భీమ్:

భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని జల్..జంగిల్…జంగ్ అనే నినాదాం నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు…

భీం చేసిన జల్, జంగిల్..జుంగ్ అనే నినాదాం సూర్తితో…తారక్ రోల్ :

నీరు, అడవి, కోసం అవసరమైతే యుద్ధం చేయాలి అనే మన కొమురం భీం ఇచ్చిన స్ఫూర్తి తో RRR మూవీ లో జూ ఎన్టీఆర్ చేస్తున్న రోల్ రాసుకున్నారు రాజమౌళి…అందుకే తారక్ కి నీటి గుణం…రామరాజు కి అగ్గి గుణం ని జోడితు చేసిన పోస్టర్స్, టీజర్స్ మనం టీజర్స్ లో చూడొచ్చు…

NTR.

Exit mobile version