ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యకరమైన కేలరీలతో నిండిన జంక్ ఫుడ్ తింటున్నారు. చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం సాధ్యం కాదు. కాబట్టి, సౌకర్యవంతంగా లభించే ప్యాక్డ్ ఆహారం లేదా జంక్ ఫుడ్ తింటునారు. ఫలితంగా, అధిక కొవ్వు, లెక్క లేని కేలరీలు శరీరంలో చేరిపోతున్నాయి. పొట్ట దగ్గర కొవ్వు(బెల్లీ ఫ్యాట్) అనేది ఒక సౌందర్య సమస్య మాత్రమే కాదు,ఇది ఒక ఆరోగ్య సమస్యగా మారింది. కొవ్వు, అధిక బరువు మరియు ఊబకాయం దీర్ఘకాలంలో చాలా హానికరం.
వేడి నీరు: ఉదయం లేవగానే 2 గ్లాసుల వేడినీరు త్రాగటం వలన ఒంటిలో ఉండే మలినాలు,కొవ్వు కరిగిపోతుంది.
అల్లం: పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అల్లం బాగా పని చేస్తుంది. దీన్ని మీరు రోజూ తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి.