కిడ్నీల్లో రాళ్ల సమస్యను తొలగించే సులువైన చిట్కాలు

కిడ్నీలో రాళ్లు ఏది ఇప్పుడు చాల మంది ఎదుర్కుంటున్న సమస్య. దీనికి కారణం… మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, స్ధూలకాయం లాంటివి ప్రధాన కారణాలు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. ఈ కిడ్నీ స్టోన్స్లో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రువిట్ స్టోన్ అనేది మూత్రనాళా ఇన్ఫెక్షన్ను కలుగచేస్తుంది. యూరిక్ యాసిడ్ స్టోన్ అనేది ద్రవరూప పానీయాలను అస్సలు తీసుకోకపోయినా (లేదా) ఎక్కువగా తీసుకున్నా వారిలో వస్తుంది. చాలామందికి ఏర్పడే కిడ్నీ స్టోన్స్లో ఎక్కువగా కాల్షియం స్టోన్స్ మాత్రమే ఏర్పడతాయి. ఇది సాధారణంగా కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి. ఈ ఆక్సలేట్ అనేది సహజంగా తీసుకొనే ఆహార పదార్థాల సమ్మేళనాల ద్వారా కాలేయ సహాయంతో రోజువారీగా తయారవుతుంది.

కిడ్నీల్లో రాళ్లుశరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి. నేటి ఆధునిక జీవితాల్లో చాలామంది సరిపడా నీళ్లు త్రాగలేకపోతున్నారు. చాలా సందర్భాలలో ఈ రాళ్లు చిన్నవిగా ఉంటూ మూత్రం ద్వారా విసర్జించబడతాయి. అయితే కొందరిలో మరీ పెద్దవై మూత్రపిండాల్లో ఉండిపోతాయి. ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ రాళ్ళను సరైన సమయంలో ఎప్పటికప్పుడు గుర్తిస్తే అవి తీవ్రమైన నష్టాన్ని కలిగించవు. వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

కిడ్నీల్లో రాళ్లుకిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువుగా నీటిని త్రాగుతూ ఉండాలి. రోజుకి సుమారు 7 నుంచి 10 లీటర్ల నీటిని, ద్రవ పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి. నీరు ఎంత ఎక్కువ తాగితే కిడ్నీలకు అంత మంచిది. దీనివల్ల వల్ల ఖనిజాలు, ఇతర మలినాలను బయటకు పంపడం కిడ్నీలకు తేలికవుతుంది. కిడ్నీలకు హాని కలిగించే అనవసర వ్యర్థాలను బయటకు పంపేందుకు నీరు సహకరిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా రాళ్లు బయటకు వెళ్తాయి.

కిడ్నీల్లో రాళ్లురాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయానే త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. ఎండబెడ్టిన తులసి ఆకులను పొడిగా నలిపండి. ఒక టేబుల్ స్పూన్ పొడిని నీటిలో కలిపి తేనీరు తయారు చేయండి. ఈ టీని రోజులో మూడు సార్లు తాగండి. ఇది కడుపులోని ఎసిటిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కిడ్నీలోని రాళ్లు సైతం విచ్ఛిన్నమై సులభంగా బయటకు పోతాయి.

కిడ్నీల్లో రాళ్లుఅరటిచెట్టు బెరడును జ్యూస్‌లా చేసి తీసుకోవటం వల్ల కిడ్నీల్లో రాళ్లు మూత్రవిసర్జనతో పాటు బయటకు వస్తాయి. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండుచిక్కుడు, టమోటా వంటి ఆక్సలేట్ పదార్థాలు తినకూడదు. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అలాంటి ఆహార పదార్ధాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.

కిడ్నీల్లో రాళ్లుఆపిల్ సీడర్ వెనిగర్ లోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీ రాళ్లను చిన్న ముక్కలుగా విడగొడుతుంది. మూత్రాశయం గుండా రాళ్లు బయటకు వెళ్లేందుకు సహకరిస్తుంది. ఆపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీల నుంచి ట్యాక్సిన్లు బయటకు వెళ్లి శుద్ధి అవుతాయి. రాళ్లు తొలగిపోయే వరకు రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్‌ను వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మంచిది.

కిడ్నీల్లో రాళ్లుకొత్తిమీర ఆకుల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజూ త్రాగటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. దానిమ్మ రసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కిడ్నీ రాళ్లను సహజంగా తొలగించడానికి దానిమ్మ రసం పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.

కిడ్నీల్లో రాళ్లుకిడ్నీ బీన్స్ కూడా మూత్ర పిండాల్లో రాళ్లను బయటకు పంపేందుకు సహకరిస్తాయి. కిడ్నీ బీన్స్‌ను 8 నుంచి 12 గంటలు నీటిలో నానబెట్టి ఉడకబెట్టి తినండి. కిడ్నీ బీన్స్‌లో ఉండే ఫైబర్ మూత్ర పిండాల్లోని రాళ్లను బయటకు గెంటేస్తాయి. రోజులో ఒక్కసారైనా వీటిని తీసుకోండి.

కిడ్నీల్లో రాళ్లుకిడ్నీలోని రాళ్లను బయటకు పంపడంలో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం కిడ్నీ రాళ్లను ముక్కలుగా చేస్తే.. వాటిని సులభంగా బయటకు పంపేందుకు ఆలివ్ ఆయిల్ లూబ్రికెంట్‌లా ఉపయోగపడుతుంది.

కిడ్నీల్లో రాళ్లుమొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR