శ్రీ హరి మరో అవతారమే ఈ వృషభాచలేశ్వరుడు. స్వామివారు వెలసిన ఈ కొండని ఎద్దుల కొండ అని పిలుస్తుంటారు. మరి శ్రీహరి ఈ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కడపజిల్లా, పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెకు సమీపంలో పవన పాపాఘ్నినది దర్శనమిస్తుంది. దానిని అనుకోని 200 మీటర్ల ఎత్తైన పెద్దకొండ ఉంది. ఇక్కడే ఈ కొండపైన వృషభాచలేశ్వరుడి ఆలయం ఉన్నది. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, ద్వాపరయుగం చివరి రోజులలో ప్రస్తుత వేంపల్లె గ్రామాన్ని అప్పుడు బాస్కరక్షేత్రమని పిలిచేవారు. అప్పట్లో వృషభుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి కోసం పన్నెండేళ్ల కఠోర తపస్సు చేయగా, అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ దేవుడు వరం కోరుకోమన్నాడు. దేవదానవ, నరవానర కిన్నెర కింపురుషులెవ్వరి చేతుల్లోనూ తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుకున్నాడు. అప్పుడు కోరిన వరాన్ని ఇచ్చేసాడు బ్రహ్మదేవుడు. ఇక ఆ వర గర్వంతో ఈ ప్రాంతంలో అందరిని హింసించసాగాడు. ఇక మునులు అందరు కలసి శ్రీ మహావిష్ణవుని ప్రార్ధించగా రాక్షసుడిని సంహరిస్తానని వారికీ మాట ఇస్తాడు. అయితే ఆ రాక్షసుడు దేవతలు, నరులు, గంధర్వులు ఇలా అందరి చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు కానీ జంతువుల గురించి మరిచిపోయాడు. అందుకే వృషభాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి వృషభవతారమెత్తి తన పదునైన కొమ్ములతో రాక్షసుడిని సంహరిస్తాడు. ఆ తరువాత మునుల కోరిక మేరకు తన నిజరూపం దాల్చి పద్మావతి సమేతుడై వెంకటేశ్వరునిగా ఆ కొండపై వెలిశాడని స్థల పురాణం. అయితే స్వామి ఎద్దురూపంలో రాక్షసుడితో పోరాడిన కొండ కాబట్టి దీనికి ఎద్దుల కొండ అని పేరు వచ్చింది. ఇలా స్వామివారు వెలసిన ఈ ఆలయంలో జనవరి ఒకటవ తేదీన మెట్ల ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఇంకా ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఆలయం చుట్టూ 11 ప్రదిక్షణలు అలా 11 శుక్రవారలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.