దేవుడు లోక కళ్యాణం కోసం కొన్ని అవతారాలు ఎత్తాడనీ చెబుతారు. మన పురాణాల విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన రావణుడిని సంహరించడానికి మానవ అవతారం ఎత్తాడనీ అదే రామావతారం అని చెబుతారు. ఇక వాల్మీకి వ్రాసిన రామాయణం కాకుండ ఇంకా ఎన్నో కథలు అనేవి వెలుగులో ఉన్నాయి. అయితే కొందరు రామాయణం జరగలేదని అది కేవలం వాల్మీకి ఉహాగా అంటే కొందరు మాత్రం రామాయణం అనేది తేత్రాయుగంలో జరిగింది వాల్మీకి చెప్పిన రామాయణం నిజం అని చెబుతారు. ఇది ఇలా ఉంటె ఈ 11 ప్రదేశాలలో ఉన్న ఈ కారణాలు రామాయణం అనేది కేవలం ఊహ కాదు నిజం అని చెబుతున్నాయి. మరి ఆ కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నాసిక్ లోని తపోవనం:సీతారామ లక్ష్మణులు వనవాసం లో ఉన్నప్పుడు ఒక గుడిసెను పంచవటి లో నిర్మించుకొని జీవించారు. ఈ ప్రదేశం నాసిక్ కి దగ్గరలో ఉంది. అంతేకాకుండా లక్ష్మణుడు, రావణుడి సోదరి అయినా శుర్పన చెవులు, ముక్కులు కత్తిరించింది ఇక్కడ ఉన్న తపోవనం లో అని చెబుతారు.
లేపాక్షి:రావణుడు, సీతాదేవిని అపహరించుకొని వెళుతుండగా ఆకాశంలో ఉన్న జటాయువు రావణుడి అడ్డుకొనగా దాని రెక్కలు కండించడం వలన ఆ జటాయువు క్రింద పడిపోతుంది. ఇక హనుమంతుడి సహాయంతో అటుగా వచ్చిన శ్రీరాముడు చాల స్థితిలో లేని ఆ జటాయువును లే పక్ష్మి అని పిలవడం వలన మోక్షాన్ని పొంది చివరకు లేపాక్షి గా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇంకా ఇక్కడ హనుమంతుడికి సంబంధించిన పాదముద్రలు ఇప్పటికి దర్శనం ఇస్తాయి.
రామసేతు:వానర సైన్యం సహాయంతో శ్రీరాముడు సముద్రపైన లంకకి చేరుకోవడానికి రామసేతుని నిర్మించాడు. ఆ కాలంలో నిర్మించి ఈ రామసేతు నిర్మాణం ఇప్పటికి ఉంది. కాకపోతే ప్రస్తుతం రామసేతు నిర్మాణం సముద్ర భూభాగంలో ఉందని చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా రామసేతు నిర్మాణం పైన వచ్చిన విభిన్న కథనాలకు తెరలేపుతూ శాస్త్రవేత్తలు, నాసా కూడా ఇది అప్పటి కాలంలో ఏర్పడిన మహా వారధి అని ఒప్పుకున్నాయి.
శివాలయం:రావణుడు మహా శివ భక్తుడు. తన శివ భక్తితో ఆత్మలింగం కూడా పొందాడని పురాణం. అయితే ఇంతటి మహాభక్తుడు శివుడి కోసం ఒక గొప్ప ఆలయాన్ని శ్రీ లంకలో నిర్మించాడు. ఈ ఆలయం ఇప్పటికి భక్తులకి దర్శనం ఇస్తుంది. అదే శ్రీలంకలోని కోనేశ్వరం ఆలయం. ఈ ఆలయం దగ్గరే రావణుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ రావణుడు పది తలలతో దర్శనం ఇస్తూ కనిపిస్తాడు. ఇంకా రావణుడు 10 రాజ్యాలను పరిపాలిస్తుండేవాడని ఇక్కడ పది రకాల కిరీటాలు మనం చూడవచ్చు.
ఈ ఆలయానికి దగ్గర్లోనే వేడి నీటి బావులు ఉంటాయి. వాటిని రావణుడే నిర్మించాడని చెబుతారు. వీటిని ఇప్పటికి మనం ఆ ప్రాంతంలో చూడవచ్చు.
అశోకవనం:శ్రీ లంకలోనే అసలు అశోకవనం ఉందని చెబుతారు. రావణుడు సీతని అపహరించి మొదటగా తీసుకువచ్చింది శ్రీ లంకలోని కోట్లవా అనే ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ అటవీ ప్రాంతాన్నే అశోక వనం అని అంటారు.
హనుమంతుడి పాద ముద్రలు:హనుమంతుడు సీతాదేవి జాడని కనిపెట్టి అశోకవనానికి వచ్చినప్పుడు ఇక్కడ తను దూకిన నేల మీద పాదముద్రలు ఏర్పడ్డాయి. ఈ పాదముద్రలు మనం ఇప్పటికి చూడవచ్చు.
లంక దహనం:లంకకి వెళ్లిన హనుమంతుడు అక్కడ నిప్పు అంటించాడని రామాయణంలో ఉంది. అందుకు నిదర్శంగా ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి భూభాగం నల్లగానే ఉంటుంది. ఇలా ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే ఇలా ఉంటుంది.
పుష్పక విమానం:రావణుడికి పుష్పక విమానం ఉండేదని పురాణాలూ చెబుతున్నాయి. అయితే శ్రీలంకలోని కొలొంబో నగరంలో ఉన్న ఉస్సంగోడ అనే ప్రాంతంలో ల్యాండ్ అయ్యేదని చెబుతారు.
హనుమాన్ గర్హి :అయోధ్య నగరంలో హనుమాన్ గర్హి అనే దేవాలయం ఉంది. ఉత్తర భారతదేశంలో హనుమంతుడికి ఉన్న ప్రముకమైన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. అయితే పురాణానికి వస్తే, హనుమంతుడు రాముడి దర్శనం కోసం వచ్చినప్పుడు శ్రీ రాముడు ప్రార్థనలో ఉన్నాడని తెలిసిన హనుమంతుడి ఇక్కడే రాముడి కోసం వేచి ఉన్నాడని చెబుతారు.
జానకి ఆలయం:మన దేశంలో కాకుండా జానకి దేవి కి నేపాల్ లోని జనక్ పూర్ లో జానకి ఆలయం ఉంది. సీతాదేవి కి మరో పేరు జానకి.
సీతాదేవి అగ్ని పరీక్ష:రావణుడి సంహారం తరువాత సీతాదేవి తన పవిత్రతను నిరూపించుకోవడం కోసం అగ్ని పరీక్ష చేస్తుంది. అయితే సీతాదేవి అగ్ని పరీక్ష చేసిన ప్రాంతం శ్రీలంకలోని దివురుమ్ పోలా అనే ప్రాంతంలో అని చెబుతారు. సీతాదేవి అగ్ని పరీక్ష చేసిన ప్రాంతంలో ఇప్పటికి ఒక చెట్టు ఇక్కడే ఉంది. ప్రస్తుతం ఆ చెట్టు క్రిందే ఆక్కడి స్థానికులు అక్కడ జరిగిన వివాదాలను పరిష్కరించుకుంటున్నారు.
రామాయణం అంటే, ఎప్పుడైనా చెడు పైన మంచి అనేది విజయం సాధిస్తుంది అనే ఒక గొప్ప సందేశం రామాయణంలో దాగి ఉంది. ఇక వాల్మీకి రాసిన రామాయణం నిజంగా జరిగింది అనడటానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు.