ఉదయం ఆలస్యంగా లేవడం వలన ఏం మిస్ అవుతున్నారో తెలుసా?

మన పూర్వికులు ఏం చెప్పిన దాని వెనుక ఎంతో నిగూడ అర్థం దాగి ఉంటుంది. అంతకు మించిన సైన్స్ ఉంటుంది. మన పెద్దలు చెప్పిన మంచి మాటల్లో ఒకటి బ్రహ్మముహూర్త సమయంలోనే నిద్ర లేవాలని. కానీ ఆధునిక ప్రపంచంలో ఉదయం లేవడం అనే భావన కష్టతరంగా మారిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు.. ఉద్యోగ, వ్యాపారాల ఒత్తిడి వంటివి. ఇక ఈ కాలం పిల్లలు ఉదయం పది అవుతున్నా.. కనీసం బెడ్ మీద నుంచి కిందకు దిగరు. అందులోనూ ప్రస్తుతం కరోనా టైం కావడంతో.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో బద్దకాలు మరింత పెరిగి.. సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే వరకు కనీసం నిద్రలేవడం లేదు.

1-Mana-Aarogyam-789అయితే ఉద‌యాన్నే లేవ‌డం వ‌ల‌న ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఇలా త్వ‌రగా లేచే వారికి గుండె జ‌బ్బులు, ఊబ‌కాయం వంటివి ద‌రిచేరే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆల‌స్యంగా ప‌డుకొని, ఆల‌స్యంగా నిద్ర‌లేచే వారికి ఈ ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు. కొన్నిసార్లు ఆల‌స్యంగా ప‌డుకొని, త్వర‌గా నిద్ర‌లేవ‌డం, త్వ‌ర‌గా ప‌డుకొని ఆల‌స్యంగా నిద్రలేవ‌డం వంటివి కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల‌న జీవ‌న‌గడియారంలో అవ‌క‌త‌వ‌క‌లు ఏర్ప‌డ‌తాయ‌ని, గుండెపై ఒత్తిడి పెరుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

3-Mana-Aarogyam-789ఉదయాన్నే లేవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయుర్వేదంలో వివరంగా వివరించారు. ఆయుర్వేదం ప్రకారం..మానవ శరీరంలో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి వాత (గాలి -ఈథర్), పిత్త (అగ్ని -నీరు) , కఫ (భూమి-నీరు). ఈ మూలకాల మొత్తం కాలంతో మారుతుంది. వాత కండరాలు, శ్వాస, మెరిసే, కణజాలం మరియు కణ కదలికలతో సంబంధం కలిగి ఉంటుంది. జీర్ణక్రియ, విసర్జన, జీవక్రియ , శరీర ఉష్ణోగ్రత ప్రక్రియలతో పిత్త సంబంధం కలిగి ఉంటుంది. కఫ శరీర నిర్మాణానికి సంబంధించినది, అంటే ఎముకలు, కండరాలు. ఈ మూడింటిలో ఎలాంటి సమస్య అయినా శరీరంలో అనేక రకాల వ్యాధులకు కారణం కావచ్చు. ఆయుర్వేదం ప్రకారం, ఉదయాన్నే మేల్కొనే వ్యక్తులలో ఈ మూడింటి సమతుల్యత మెరుగ్గా ఉంటుంది.

4-Mana-Aarogyam-789ఉదయాన్నే లేవడం వల్ల.. స్వచ్ఛమైన గాలి పీల్చకునే అవకాశం ఉంది. సమయం గడుస్తున్న కొద్ది.. వాహనాల రొదలతో.. వాతావరణం కాలుష్యమౌతుంది. కానీ తెల్లవారుజామున గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది పీల్చడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా హాయిగా కూడా ఉంటుంది. అలాగే ఉదయాన్నే లేచేవారు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారట. వారి బ్రెయిన్ ఎక్కువ చురుకుగా పనిచేస్తుందట. ఎందుకంటే ఉదయాన్నే లేస్తే.. మనం చేయాల్సిన అన్నీ పనులు ఎలాంటి తొందర లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే.. ఉదయాన్నే లేచేవారిలో ఒత్తిడికి చాలా తక్కువ గురౌతారట. దీంతో.. వారు అనుకున్నది సాధించగలిగే అవకాశం ఉంటుంది.

2-Mana-Aarogyam-789వ్యాయామం చేసుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది. అలా ఉదయాన్నే లేచి యోగా, వ్యాయామం లాంటివి చేయడం వల్ల ఆరోగ్యం మన సొంతమౌతుంది. అంతేకాకుండా స్కూల్, కాలేజ్, ఆఫీసులకు సమయానికి వెళ్లే అవకాశం దొరుకుతుంది. ఆలస్యంగా నిద్ర లేస్తే టైమ్ లేదని ఏదో ఒకటి తిన్నామంటే తిన్నామని పరుగులు పెడుతూ వెళ్ళిపోతాం. దాని వల్ల అనారోగాల పాలవుతారు. అలాకాకుండా.. ఉదయాన్నే లేవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని తినే సమయమూ ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కూడా. అంతేకాకుండా.. ఉదయాన్నే నిద్రలేచేవారు.. రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమిస్తారు. దాని వల్ల వారికి సరిపడ నిద్ర లభిస్తుంది. హాయిగా త్వరగా నిద్రపోగలుగుతారు.

5-Mana-Aarogyam-789

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR