21వ శతాబ్దంలో బ్రతుకుతున్న మన అందరికి ఇంగ్లీష్ బాషా అవసరం తప్పనిసరి అయిపోయింది. సరే…పెద్ద పెద్ద కంపెనీస్, అందులో జాబ్స్ కొట్టాలి అంటే ఆంగ్లం తప్పనిసరి, ఆఫీస్ లో ఆంగ్లం మాట్లాడాలి ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, ఫోన్ లో, ఫేసుబుక్ లో, వాటాస్ప్ లో నుండి స్టార్ట్ చేస్తే ఇంట్లో పెళ్ళాం పిల్లలతో కూడా వద్దు అన్న ఆంగ్లమే మాట్లాడుతున్నాం.
ఆంగ్ల బాషా బ్రతకడానికి అవసరమే నేను కాదు అనను…కానీ ఆంగ్లమే బ్రతుకు కాదు. ఇలా ఆంగ్ల బాషా మోజులో పడి, మన మాతృ బాషాలో కొన్ని పదాలను మనమే చంపేసుకున్నాము.
అవును ఆకలేస్తే , బువ్వ అని….దాహం వేస్తే నీళ్లు అని…అడిగే కొన్ని తీయనైన తెలుగు పదాలను…కనీసం ఈరోజు పలకడానికే ఇబ్బంది పడుతున్నాం.
మనం మర్చిపోయిన…కాదు మనం చంపేసిన కొన్ని తెలుగు పదాలు ……….
1) అన్నం-బువ్వ (మీల్స్)
2) కూర (కర్రీ)
3) కంచం (ప్లేట్)
4) లోటా (గ్లాస్)
5) పచ్చడి – (చట్నీ)
6) ఊరగాయ – (పికిల్)
7) నీళ్లు -(వాటర్)
8) సీసా – ( బాటిల్)
9) చెంచా – (స్పూన్)
10) పాలు -( మిల్క్)
11) పెరుగు – (కర్ఢ్)
12) తుండుగుడ్డ -(టవల్)
13) చొక్కా- అంగీ ( షర్ట్)
14) ఉప్పు – (సాల్ట్)
15) ఘాటు – (స్పైసీ)
16) చేతి గుడ్డ – ( హాఁ కీ)
17) బల్ల – (టేబుల్)
18) కుర్చీ – (చైర్)
19) మంచం – (కాట్)
20) పొడుగు లాగు- (పాంట్)
21) తీపి – ( స్వీట్)
22) తలుపు -( డోర్)
23) కిటికీ – ( విండో)
24) తాళం – (లాక్)
25) తాళం చెవులు -( కీస్)
26) మీట – ( స్విచ్)
27) పుస్తకం -(బుక్)
28) కాగితం – (పేపర్)
29) కలం – (పెన్)
30) పలక -(స్లేట్)
31) సూది -(నీడిల్)
32) దారం – (థ్రెడ్)
33) స్నానం – ( బాత్)
34) సబ్బు – (సోప్)
35) సంచి – (బ్యాగ్)
36) పొడి – (పౌడర్)
37) బడి – (స్కూల్)
38) పాఠం – (లెసన్)
39) లెక్కలు -(మాథ్స్)
40) ఎక్కాలు- (టేబుల్స్)
41) సాంఘీక శాస్త్రం- (సోషల్)
42) సామాన్య శాస్త్రం -( సైన్స్)
43) చరిత్ర – (హిస్టరీ)
44)అర్ధ శాస్త్రం (ఎకనామిక్స్)
45) బలపం -(స్లేట్ పెన్సిల్)
46) రంగు – (కలర్)
47) సమయం – (టైం)
48) దారి – దోవ- (రోడ్)
49) అమ్మ -(మమ్మీ)
50) నాన్న -(డాడీ)
51) నెల – (మంత్)
52) పిన్ని-ఆమ్మ- అత్త (ఆంటీ)
53) పెదనాన్న, బాబాయ్ మామ (అంకుల్)
కనీసం ఇప్పుడైనా ఇది గ్రహించి బావి తరాలకు….తెలుగు బాషాను మరువకుండా జాగ్రత్త పడుదాం…ఇంట్లో అమ్మ నాన్నలతో, అక్క చెల్లెలు, అన్న తమ్ములు అందరితో సాద్యమైనంత వరకు తెలుగు లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేదంటే, ఈ రోజు ఈ పదాలను చంపుకున్న మనం రేపు ఏకంగా మన మాతృ బాషానే చంపుకుంటాం అనడంలో ఎలాంటి సందేహం లేదు.