శివుణ్ని ముక్కంటిగా ఎందుకు పిలుస్తారు దాని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి

శివుణ్ని ముక్కంటిగా పిలుస్తారు. పరమశివుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు.. కోరిన కోరికలు తీరుస్తాడు. తను ఇబ్బందులు ఎదుర్కొంటానని తెలిసినా దానవుల అసంబద్ధమైన కోరికలను తీర్చిన భోలా శంకరుడాయన. గరళాన్ని కంఠంలో ఉంచుకొని నీల కంఠుడయ్యాడు. కానీ అదే శివుడికి కోపం వస్తే విలయమే. అందుకే ఆ పరమేశ్వరుణ్ని ప్రళయకారుడిగా భావిస్తారు. మహాశివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే వినాశనం తప్పదని నమ్ముతారు. శివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే.. ఆ కోపాగ్నికి లోకం భస్మం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.శివుడి మూడో కన్ను.. ప్రళయానికే కాదు, జ్ఞానోదయానికీ చిహ్నమే.

Muktantiకుడి కన్ను సూర్యుడికి, ఎడమ కన్ను చంద్రుడికి ప్రతీకలైతే.. మూడో కన్ను అగ్నికి చిహ్నం. మూడో కన్ను విధ్వంసానికే కాదు.. ఆధ్యాత్మిక జ్ఞానానికి, వివేకానికి కూడా చిహ్నమే. రెండు కళ్ల ద్వారా చూడలేని దాన్ని మూడో కన్ను ద్వారా పరమ శివుడు చూస్తాడని భావిస్తారు. మూడో కన్ను తెరిస్తే దుష్ట శక్తులు, అజ్ఞానం నాశనం అవుతాయని నమ్ముతారు. మూడో కన్నును చెడు, దుష్ట శక్తుల అంతానికి సూచికగా భావించొచ్చు అయితే మూడో నేత్రం శివుడికి ఎలా ప్రాప్తించిందో చూద్దాం..

Muktantiఒక ఇతిహాసం ప్రకారం త్రిమూర్తుల జననం ఒక విచిత్రం. ఆది పరాశక్తి, త్రినేత్రి అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన అనంతరం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను పరిణయమాడ వలసిందిగా కోరింది. దానికి మొదట వారు ఒప్పుకోలేదు. తర్వాత పరమశివుడు తనను వివాహమాడటానికి ఒక షరతు మీద అంగీకరించాడు.

Raj Rajeshwari Devi ఆ షరతు ఏమిటంటే వివాహం జరిగిన తరువాత ఆమె మూడో నేత్రం తనకు ఇవ్వాలని. దానికి ఆమె అంగీకరించి శివుడ్ని వివాహమాడి, తన మూడో నేత్రాన్ని శివుడి కి ఇచ్చింది. మూడో నేత్రాన్ని స్వీకరించిన శివుడు ఆ నేత్రశక్తి తో ఆమెను భస్మం చేసి ఆ భస్మరాశి ని మూడు భాగాలుగా విభజించాడు. బ్రహ్మ ఆ మూడు భాగాలకు ప్రాణం పోశాడు. వాళ్ళే లక్ష్మి, పార్వతి, సరస్వతి అని పురాణాలు కూడా చెబుతున్నాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR