నాన్ వెజ్ అనగానే చికెన్, మటన్ ఎలా సీన్ లోకి వస్తాయో వెజ్ వంటకాల్లో పన్నీర్ అలా తెరపైకి వస్తుంది. పాల పదార్థాలలో ఒకటైనా పన్నీర్ ను వివిధ రకాల వంటలలో ఉపయోగించడం చేస్తుంటాము. పన్నీర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పన్నీర్ పాలనుంచి తయారు అవుతుంది కనుక అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్లతో పాటు అధిక మొత్తంలో కొవ్వులు కూడా ఉంటాయి. అయితే పాలతో తయారవుతుంది కాబట్టి పనీర్ తింటే బరువు పెరుగుతారు అని అందరూ అనుకుంటారు.. కానీ అది అపోహ అని చెప్పాలి.
పన్నీర్ ను పాల నుండి తయారు చేస్తారు. తయారు చేసిన పాలలో కొవ్వు శాతాన్ని బట్టి పన్నీర్ లో ఎంత కొవ్వు ఉంటుందో తెలుస్తుంది. తక్కువ కొవ్వు ఉన్న పాలనుంచి చేసిన పన్నీర్ లో మాంసకృత్తులు ఎక్కువ. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పన్నీర్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి శరీరానికి కావాల్సిన పోషకాలను పన్నీర్ అందిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలోనూ సహయపడుతుంది.
పాల పదార్థాలలో ఒకటైన పన్నీర్ లో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే తరుచూ పన్నీరు తినడం ద్వారా మన శరీరానికి తగినన్ని పోషకాలు అందడమే కాకుండా పిల్లల ఎదుగుదలకు, పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం కోసం పన్నీరు దోహదపడుతుందని చెప్పవచ్చు.ఆవుపాలలో కేసిన్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్ ఉపయోగించడం ఎంతో ఉత్తమం. వీటిలో ప్రొటీన్లు కొవ్వులతోపాటు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో పిండిపదార్థాలను సులభంగా వేరు చేయబడుతుంది.
మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నా, కొంత పిండి పదార్థాలున్నప్పటికీ పన్నీర్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వంద గ్రాముల పన్నీర్ లో సుమారుగా 250 నుండి 300 కెలోరీలు ఉంటాయి. కాబట్టి మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉండే నూనెలో వేయించిన పన్నీర్ వంటలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. పరిమిత మోతాదులో, అంటే రోజుకు 60 -70 గ్రాములకు మించకుండా పన్నీర్ తీసుకుని, రోజులో మిగతా ఆహారాన్ని కూడా కెలోరీ పరిధికి లోబడి తీసుకుంటే మంచిది.
అధిక బరువు ఉన్నవారు కూడా పన్నీర్ తీసుకోవచ్చు. పన్నీర్ లో మాంసకృత్తుల వలన ఆకలి త్వరగా వేయదు. బరువు తగ్గాలనుకునే వారు ఓ పూట పన్నీర్ తీసుకొంటే బరువు తగ్గేందుకూ ఉపయోగ పడుతుంది. అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలను మీరు ఎక్కువగా తిన్నప్పుడు.. పన్నీరు మీ బరువు తగ్గించడంలో భాగంగా కొవ్వును బర్న్ చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడమే కాకుండా పిల్లలకు పోషకాహరంగానూ ఉపయోగపడుతుంది.
ఇందులో ఐరన్ లెవల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియమ్, ఫాస్ఫరస్‌తో పాటు విటమిన్ బి- 12 పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది దంతాలు, ఎముకలను బలంగా ఉంచడంలో సహయపడుతుంది. దాదాపు 100 గ్రాముల పన్నీర్‌లో 83 గ్రా కాల్షియం ఉన్నట్లు గుర్తించారు. ఇది మన శరీరానికి అవసరమైన దానికంటే 8 శాతం ఎక్కువ. కాబట్టి బరువు తగ్గించడమే కాదు.. జీవక్రియను పెంచడంలో కూడా పన్నీర్ సహాయపడుతుంది.
పన్నీర్‌లో ఉండే ఫొలేట్ పుష్కలం గా ఉండి ఎర్రరక్తకణాలను పెంచుతుంది . ఫోలేట్ బి కాంప్లెక్స్ విటమిన్.ఇది గర్భంలో ఉన్న పిండాభివృద్ధి కి తోడ్పడుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ కి ఇది చాలా అవసరం. ఇందులో విటమిన్-డి. కాల్షియంలు ఎక్కువశాతం ఉండడం వలన ఇది రొమ్ము క్యాన్సర్‌ని అడ్డుకుంటుంది. యాంగ్జయిటీ తగ్గించి స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది. పన్నీర్ ఆహారంలో తీసుకోవడం వలన అది శరీరంలో కొత్త కణాల పుట్టించి,శరీరాన్ని వృద్ధాప్య ఛాయలు నుండి కాపాడుతూ, వయసుకి తగ్గట్టుగా బిగుతుగా ఉండేట్లు చేస్తుంది. పన్నీర్ లో ఉండే పోషక విలువలు ఆడవారి మెనోపాజ్ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.