Everything About What Happens In Tirumala For Every 12 Years

దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీమహావిష్ణువు కలియుగం లో వెంకటేశ్వరస్వామిగా ఈ ఏడు కొండలపైన ఆనందనిలయంలో స్వయంభువుగా వెలిసి భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. ఈ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతి రోజు కొన్ని వేలమంది భక్తులు వస్తుంటారు. అయితే తిరుమలలో 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాసంప్రోక్ష సందర్భంగా వైదిక కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడతారు. మరి  తిరుమల తిరుపతిలో జరిగే బాలాలయ అష్ట దిగ్బంధన మహాసంప్రోక్షణ ఏంటి? గడిచిన కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ క్రతువు ఎలా జరిగింది  అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

What Happens In Tirumala For Every 12

తిరుమలలో  అనాదిగా సాగుతుంది వైఖాసన సంప్రదాయం. ఈ అష్టబంధన మహాసంప్రోక్షణలో అనేక ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది ఆలయ వైభవాన్ని మూలవిరాట్టు శక్తిని ద్విగుణీకృతం చేసే క్రతువు. మహాసంప్రోక్షణలో ముఖ్యమైనవి రెండు, మొదటిది స్వామివారి ప్రాణశక్తిని ద్విగుణీకృతం చేయడం, రెండవది గర్భగుడిలో మరమత్తులు నిర్వహించడం.

What Happens In Tirumala For Every 12

ఇక ఈ మహాసంప్రోక్షణలో ముఖ్యఘట్టం కళాకర్షణ, మూలవిరాట్టులోని ప్రాణశక్తిని పూర్ణకలశంలోకి, ఆవాహన చేసి  బాలాలయంలో ప్రతిష్టింపచేయడమే కళాకర్షణ. బలాలయం అంటే తాత్కాలిక ఆలయం అని అర్ధం. క్రతువులు పూర్తయేంత వరకు పూర్ణ కలశానికే నిత్య పూజలు జరుగుతాయి. అయితే కళాకర్షణ జరిగాకే గర్భాలయంలో మరమత్తులు నిర్వహణ. ఇంకా మూలమూర్తి పీఠం చుట్టూ అష్టబంధనం చేయడం మరొక కీలక ఘట్టం.

What Happens In Tirumala For Every 12

అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణం. దీని ఆయుర్దాయం 12 ఏళ్లు ఉంటుంది. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతారు.  అష్టబంధన ద్రవ్యం లో  మైనం, ఎర్రమట్టి, శంకు పొడి, చక్కర, నెయ్యి, నల్ల బెల్లం, పత్తి గింజలు, పళ్ళ గుజ్జు మిశ్రమం ఉంటుంది. ఈ 8 రకాల వస్తువులతో రూపొందించే ద్రవ్యంతో అష్టబంధనం చేస్తారు. మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూలవిరాట్టు, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహనచేసి ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తారు.

What Happens In Tirumala For Every 12

తిరుమల తిరుపతిలో 12 ఏళ్లకోసారి జరిగే బాలాలయ అష్ట దిగ్బంధన మహాసంప్రోక్షణ సందర్భంగా వైఖానస ఆగమ నిబంధనల మేరకు ఆ సమయంలో ఆలయ సిబ్బంది సైతం బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. గర్భాలయంలో మరమ్మతులనూ అర్చకులే చేస్తారు.  అయితే ముందుగా ఆగస్టు 11న అంకురార్పణంతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదియే మూలవిరాట్టు పీఠం పటిష్టతకు అష్టబంధన ద్రవ్యం. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వేణుగోపాలదీక్షితులు కంకణభట్టార్‌గా వ్యవహరిస్తారు. 40 మందికిపైగా ఋత్వికులు, దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు ఇందులో పాల్గొంటారు.

What Happens In Tirumala For Every 12

ఇక ఆగస్టు 14 వ తేదీ స్వామివారికి అష్టబంధన సమర్పణ, ఆగస్టు 15 వ తేదీన శ్రీవారి మూలవిరాట్టుకు మహాశాంతి అభిషేకం. ఆగస్టు 16 వ తేదీన తుల లగ్నంలో ఆనందనిలయ మహాసంప్రోక్షణ, ఆనందనిలయ విమానానికి పవిత్ర జలాలతో మహా కుంభాభిషేకం జరుగుతుంది. ఇలా ఆగస్టు 11వ తేదీన మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరిగి 12 నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు.

What Happens In Tirumala For Every 12

ఇది ఇలా ఉంటె మహాసంప్రోక్షణలో భాగంగా  పూర్వం నుండి ఇప్పటివరకు  జరిగినవి:

* 1800 వ సంవత్సరంలో మహాసంప్రోక్షణలో మూలవిరాట్టుకు బంగారు పూత.

* 1908 మహాసంప్రోక్ష లో ఆనందనిలయానికి నూతన కలశం.

* 1934 , 1946 సంవత్సరాల్లో మూలవిరాట్టు కి కొత్త నగలు.

* 1958 సంవత్సరంలో నెలరోజుల పాటు మహాసంప్రోక్ష న, ఆనందనిలయానికి పెద్ద ఎత్తున  బంగారు         తాపడం.

* 1970 మహాసంప్రోక్షణలో ఆనందనిలయానికి బంగారు పూత.

* 1982  వ సంవత్సరంలో మహాసంప్రోక్షణలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట.

* 1994 సంవత్సరంలో కన్నుల పండుగగా పుష్కరోత్సవం.

* 2006 సంవత్సరంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించిన వేద పండింతులు.

What Happens In Tirumala For Every 12

ఇదిలా ఉంటె, గతంలో ఆలయాన్ని గంటల తరబడి మూసివేసినా, పరిమిత సమయం పాటు భక్తులకు దర్శనాన్ని కల్పించేవారు. కానీ ఈ సంవత్సరం  వచ్చే మహాసంప్రోక్షణ సమయంలో తొమ్మిది రోజుల పాటు స్వామి వారి దర్శనం ఉండదని ముందుగా టీటీడీ ప్రకటించగా, భక్తులని స్వామివారి దర్శనం కోసం ఎదురుచూసేలా చేయడం సరైనది కాదని ఎన్నో విమర్శలు తలెత్తడంతో పున: సమీక్షిస్తామని టిటిడి అధికారులు తెలిపారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,540,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR