భర్తతో పాటు తనువు చాలించి దేవిగా అవతరించిన అమ్మవారి ఆలయ విశేషాలు

0
12524

దేవుళ్ళ గురించి వారి గొప్ప తనం గురించి అనేక పురాణాల్లో మనం చదువుతుంటాము. అలానే కొన్ని ప్రాంతాల్లో మనుషులే దేవుడిగా వెలసి వారికీ గుడి అనేది కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి గుడిలలో ఒక గుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

aalayamఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కృష్ణాజిల్లా లోని విజయవాడకి కొంత దూరములో నందిగామ ప్రాంతానికి దగ్గరలో జగ్గయ్యపేట మండలంలో పెనుగంచిప్రోలు అనే గ్రామములో శ్రీ తిరుపతమ్మ తల్లి దేవాలయం కలదు. ఈమె ఒక సాదారణ గృహిణి. మరి ఈ సాధారణ గృహిణి దేవత మూర్తిగా ఎలా వెలసిందనేది ఈ కథ.

aalayamపెనుగంచిప్రోలు గ్రామం క్రీ.శ.1700 ప్రాంతంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గ భూపాలుని పరిపాలనలో ఉండేది. తిరుపతమ్మ బాల్యం నుండి గారాబంగా పెరుగుతూ,సంప్రదాయాలను పాటిస్తూ,నియనిష్ఠలతో దైవభక్తితో గడుపుతూ ఉండేది. ఆమెకి యుక్త వయస్సు వచ్చిన తరువాత మేనమామ కుమారుడైన కాకాని గోపయ్యతో ఆమె వివాహం జరిగింది. వివాహం తరువాత తిరుపతమ్మ అత్తారిల్లు అయినా పెనుగంచిప్రోలు వచ్చినది. ఇలా అత్తారింటికి అడుగుపెట్టగానే ఆ గ్రామం ఏ కాకుండా చుట్టూ ఉండే గ్రామాలూ కూడా పాడిపంటలతో,సస్యశ్యామలంగా,సుబిక్షంతో కళకళలాడాయి. ఇంతటి శుభపరిమానానికి కారణం ఆమె అని ఆమెని ధర్మాత్మురాలుగా కీర్తించారు.

aalayamఈ విధంగా కొంత కాలం జరిగిన తరువాత ఒక సంవత్సరం ఎండలు అనేవి బాగా పెరిగి వర్షాలు కురవక కరువు కాటకాలు సంబవించినవి. అలాంటి కరువు సమయంలో ఏడూ దొడ్ల ఆలమందగల పశువులను మేపడం కోసం కంచికచర్లకి దగ్గరలో ఉన్న అరణ్యంలోకి గోపయ్య బయలుదేరాడు. అతను వెళ్లిన కొన్ని రోజుల తరువాత అత్తా ఇంకా తోడి కోడళ్ళు కలసి ఆమె వేధించసాగారు. పని అంత ఆమెతో చేయించి కనీసం తిండి కూడా పెట్టకుండా బాగా పీడించారు. అలా రోజు రోజుకి బక్కపలుచుగా అవ్వడమే కాకుండా కుష్టువ్యాధి గ్రస్తురాలైంది. ఆమెకి ఆ వ్యాధి సోకడం తో గొడ్ల చావిడలోనే ఎప్పడూ ఉండాల్సిందిగా ఇంట్లోకి రావొద్దు అని ఆదేశించారు.

aalayamఅలాంటి పరిస్థితిలో తిరుపతమ్మకి పాపమాంబ అనే స్త్రీ ఆమెకి ధైర్యం చెప్పి దగ్గర ఉండి అన్ని చూసుకుంది. ఇది ఇలా జరుగుతున్న తరుణములో పశువులను మేపడానికి వెళ్లిన గోపయ్య ను పెద్ద పులి చంపేస్తుంది. ఈ వార్తని జీర్ణించుకోలేని తిరుపతమ్మ తను ఇక జీవించడం అనవసరమని తలచి విధివిధానం తెలుసుకొని తన అవతార సమాప్తం గురించి గ్రామాధికారులకి తెలియచేసి,తాను ఈ క్షేత్రమునందే దేవతగా వెలసి భక్తుల కోర్కెలు తీర్చెదనని అంతేకాకుండా గొడ్లచావిడిలో తనకి చివరి దశలో ఎన్నో సేవలు చేసిన పాపమాంబ తనకి పూజలు నిర్వహిస్తుందని చెప్పి తన భర్త పాదరక్షలు తన ఎదపైన పెట్టుకొని ఆమె సహగమనం చేసి తన తనువు చాలించి వెంటనే దేవిగా అవతరించి గ్రామవాసులు చేత పూజలందుకొన్నది.

aalayamఆ విధంగా వెలసిన శ్రీ లక్ష్మి తిరుపతమ్మ రోజు రోజు తన భక్తులని పెంచుకుంటూ ప్రస్తుతం ఒక గొప్ప దేవతామూర్తిగా పూజించబడుతుంది.

6 Tirupati Amma Temple