ద్వాపరయుగం నాటి చిన్ని కృష్ణుడి విగ్రహం ఉన్న అద్భుత ఆలయం

0
10088

శ్రీ కృషుడి ఆలయాలలో ఇది చాల ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆలయంలోని మూలవిరాట్టు బాలకృష్ణుడు. అంతేకాకుండా భూలోక వైకుంఠంగా ఈ ఆలయాన్ని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? బాలకృష్ణుడు ఇక్కడ ఎలా వెలిశాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

udipiకర్ణాటక రాష్ట్రము దక్షిణ కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉడిపి అనే పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. ఉడుప అనే మాట నుంచి ఈ ఉరికి ఉడిపి అనే పేరు వచ్చింది. ఉడుప అంటే చంద్రుడు. తన మామగారైన దక్ష ప్రజాపతి వల్ల శాపం పొందిన చంద్రుడు ఇక్కడ చంద్రపుష్కరి అనే పేరు ఉన్న తటాకం ప్రక్కన చంద్రమౌళీశ్వరుని గూర్చి తపస్సు చేసి శాపవిమోచనం పొందాడని స్థలపురాణం. ఈ ఆలయం 13 వ శతాబ్దం నాటిది అని తెలుస్తుంది. ఈ ఆలయంలోని చిన్ని కృష్ణుడి విగ్రహం ద్వాపరయుగం నాటిదిగా ప్రతీతి. ఈయన ఒక చేతిలో త్రాడు, మరొక చేతిలో కవ్వముతో వివిధ ఆభరణములు ధరించి దివ్య మంగళ రూపంతో భక్తులకి దర్శనమిస్తున్నాడు.

udipiమధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు.

udipiప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు.

udipiచెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత హనుమంతుడు, వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర.

udipiఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి రోజుకి 9 సార్లు అర్చనలు జరుగుతాయి. కిలో బంగారం, మూడువేల వజ్రాలు, ఇతర విలువైన రాళ్లతో తయారైన కిరీటం శ్రీ కృషుడికి అలంకరిస్తారు.

7 Udipi Balakrishna Templeఈవిధంగా ఉడిపిలో వెలసిన బాలకృష్ణుడికి మేధ్యసరోవరం అనే పేరుగల ఉత్సవం చాలా గొప్పగా జరుగుతుంది.