శివలింగానికి బదులు శివుడి బొటను వేలి ఆకారానికి పూజలు చేసే అద్భుత ఆలయం

త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు. మన దేశంలో ఎన్నో అతి పురాతన శివాలయాలు అనేవి ఉన్నాయి. మనకి ఆ పరమశివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం అన్ని ఆలయాలకు బిన్నంగా దర్శనం ఇస్తుంటాడు. ఇక్కడ శివలింగం బదులు శివుడి బొటను వేలి ఆకారానికి పూజలు చేస్తుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? శివుడు ఎందుకు ఈ ఆలయంలో ఇలా దర్శనం ఇస్తుంటాడనే మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మహాదేవ్ ఆలయంరాజస్థాన్ రాష్ట్రం, మౌంట్‌ అబూ కి దగ్గరలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇక్కడ వెలసిన శివుడిని అచలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయంలో శివలింగం అనేది ఉండదు, వలయాకారంలో ఒక సొరంగం ఉండగా అందులో చేతికి అందే అంత నీరు పైకి ఉండగా, ఆ నీటి పై భాగంలో బొటన వేలు ఆకారం ఉంటుంది. ఆ బొటన వేలు శివుడి కాలి బొటన వేలు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఆ కాలి బొటన వేలుకు పూజలు చేస్తుంటారు.

మహాదేవ్ ఆలయంఇక శివుడికి అచలేశ్వరుడు అని పేరు రావడానికి, బొటన వేలు ఆకారం ఇక్కడ ఏర్పడటానికి కారణం ఏంటంటే, ఆరావళి పర్వతాలు ఎక్కడికి కదిలి పోకుండా ఉండటం కోసం శివుడు తన కాలి బొటన వేలుతో అదిమిపట్టాడని, చలన లక్షణం ఉన్న పర్వతాలను అచలం చేసాడని అంటే చలించ కుండా చేసాడని అందుకే ఈ ఆలయంలో శివుడిని అచలేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారని పురాణం. ఇంకా శివుడి బొటన వేలు ఆకారంలో ఏర్పడిన సొరంగం పాతాళం వరకు ఉండగా, ఈ సొరంగాన్ని నీటితో నింపడానికి ఆరు నెలల సమయం పట్టిందని స్థల పురాణం చెబుతుంది.

మహాదేవ్ ఆలయంఇక ఈ ఆలయ విషయానికి వస్తే, పంచ లోహాలతో చేసిన సుమారు ఐదు టన్నుల బరువైన నంది విగ్రహం, దాని పక్కన పిల్లవాడి రూపం దర్శనం ఇస్తుంటాయి. ఇలా దర్శనం ఇవ్వడం వెనుక ఒక కథ ఉంది, పూర్వం వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటుండగా ఒక ఆవు సొరంగం లో పడిపోగా, ఆ మహర్షి కి సొరంగం నుండి ఆవుని తీయడం సాధ్యం కాదని తెలిసి శివుడిని ప్రార్ధించగా అప్పుడు శివుడు సరస్వతి నదిని పంపించగా ఆ నది ప్రవాహంతో ఆవు బయటపడుతుంది. ఇప్పటినుండి కూడా ఎవరికీ ఇలాంటి ఆపద రావొద్దని ముని శివుడిని ప్రార్ధించగా అప్పుడు హిమాలయాదీశ్వరుడి కుమారుడు సొరంగం నీటితో నిమడానికి సహాయం చేసాడని పురాణం. నంది పక్కన కనిపించే విగ్రహం హిమాలయాదీశ్వరుడి కుమారుడని చెబుతారు.

మహాదేవ్ ఆలయంఈ ఆలయం పక్కనే మూడు రాతి గేదలు కూడా ఉంటాయి. అయితే ఇది నేతి తటాకం కాగా పూర్వం ముగ్గురు రాక్షసులు ఆ తటాకంలోకి దిగి అపరిశుభ్రం చేయగా ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఆ ముగ్గురు రాక్షసులను బాణాలతో సంహరిస్తాడు. అందుకే ఒక ఒడ్డున మూడు రాతి గేదలు ఉండగా మరొక ఒడ్డున రాజు శిలారూపాలు ఉన్నాయని చెబుతారు.

మహాదేవ్ ఆలయంఇక ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో పారమార రాజవంశస్థులు నిర్మించారు. ఈ ఆలయానికి దగ్గరలో ఒక కొండ గుహ అనేది ఉంటుంది. ఈ గుహని గోపిచంద్ గుహ అని పిలుస్తారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి శివుడి కాలి బొటన వేలుని దర్శనం చేసుకోవడం భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR