పార్వతి దేవిని చూసి మోహించిన రాక్షసుడు.. చివరికి..!

0
404

హిందువుల ప్రధాన పండుగలలో విజయ దశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటినుండి 9 రోజులు జరిగే దేవి నవరాత్రులు ఉత్సవాలనే దసరా అని పిలుస్తాము. శరత్ఋతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అనికూడా పిలుస్తాము.

Durga Deviశరన్నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాలుగా అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. మొదటి రోజు… శ్రీ స్వర్ణ కవచాలంకృతిక దుర్గ దేవి. 2. బాలాత్రిపుర సుందరి. 3. గాయత్రి దేవి. 4. అన్నపూర్ణ దేవి. 5. లలితా త్రిపుర సుందరి. 6. శ్రీ మహాలక్ష్మి దేవి. 7. సరస్వతి దేవి. 8.శ్రీ దుర్గ దేవి. 9. శ్రీ మహిషాసుర మర్ధిని దేవి గా దర్శనమిస్తారు. ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని ప్రతీతి.

దసరా పండుగ చరిత్ర

Durga Deviపూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే దున్నపోతు. దున్నపోతు ఆకారంలో ఉండటంవల్ల అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు . తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు. మహిషాసురునికి స్త్రీ జాతి అంటే చిన్న చూపు. ఆడవారు బానిసలుగా మాత్రమే ఉండాలనే ఆలోచన కలిగి ఉండేవాడు. వరం పొందిన గర్వంతో దేవతలను ప్రజలను హింసించసాగాడు.

Durga Deviఒక నాడు ఇంద్రుడు ఒక సభ ఏర్పాటు చేసాడు. ఆ సభకు దేవతలు అందరూ వస్తారు. ఆహ్వానం లేకపోయినా మహిషాసురుడు కూడా వస్తాడు. అక్కడ అపురూప సౌందర్య వతి అయిన పార్వతి దేవిని చూసి మోహిస్తాడు. తన పట్టపు రాణి అవ్వమని, లేదంటే బలవంతంగా తన బానిసను చేసుకుంటానని అవమానిస్తాడు. అవమాన భారంతో పార్వతి కైలాసంకి వెళ్ళిపోతుంది. అయినా తన వెనకాలే పల్లకి పంపిస్తాడు. అది గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువునుండి సుదర్శన చక్రం, శివుడినుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా సింహాన్ని వాహనంగా పొందింది. అస్త్రశస్త్రాలతో దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి అతన్ని వదించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవీనవరాత్రులుగా 10 వ రోజున విజయానికి చిహ్నంగా విజయ దశమి జరుపుకుంటాము.

SHARE