శుక్రుడు రాక్షసుల గురువు అని ఎందుకు అంటారు?

0
2218

ఖగోళంలో చంద్రడి తరువాత అంత ప్రకాశవంతంగా ఉండే గ్రహం శుక్రగ్రహం అని చెబుతారు. ఈ గ్రహాన్ని అందలాగ్రహం, ఉదయతారా, సంధ్యతారా అని కూడా పిలుస్తుంటారు. మరి శుక్రుడు రాక్షసుల గురువు అని ఎందుకు అంటారు? శుక్రగ్రహం గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shukra Graha

సూర్యుడి నుండి రెండవ గ్రహం శుక్రుడు. ఈ గ్రహం ఉదయ సంధ్యాకాలంలో అంటే సూర్యోదయానికి ముందు తూర్పు దిక్కున, సూర్యాస్తమయం తరువాత పశ్చిమ దిక్కున ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుకే ఈ గ్రహాన్ని ఉదయతారా, సంధ్యతారా అని పిలుస్తుంటారు. అయితే ఉభయ, సంధ్యాకాలంలో రాక్షసులకు శక్తి ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు కూడా ఉభయ, సంధ్యాకాలంలో ఎక్కువగా ప్రకాశిస్తాడు కనుక శుక్రుడు రాక్షులకి పరాశక్తిని ప్రసాదిస్తాడని, శుక్రుడిని రాక్షసుల గురువుగా వర్ణించారు. ఇంకా సౌరకుటుంబంలో అన్నిగ్రహాలు ఎడమనుండి కుడివైపుకు తిరుగుతూ సూర్యప్రదక్షిణలు చేస్తుంటాయి కానీ శుక్రగ్రహం అన్ని గ్రహాలకి వ్యతిరేకంగా కుడి నుండి ఎడమకు తిరుగుతూ ప్రదక్షిణ చేస్తుంది. ఇలా అన్ని గ్రహ దేవతలకు వ్యతిరేకంగా ఈ గ్రహం ఉన్నందున దీనిని రాక్షసులకు గురువుగా అంటారు.

Shukra Graha

ఇక పురాణం విషయానికి వస్తే, గురువు బృహస్పతి యొక్క కుమారుడు శుక్రుడే రాక్షస గురువు శుక్రాచార్యుడు. క్షిరసాగర మధనం జరుగగా ముందుకు శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి మృతసంజీవనీ విద్యను సంపాదించాడు. ఇలా మృత సంజీవిని విద్య తెలియడంతో యుద్ధంలో చనిపోయిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. ఈ విద్య తెలియని దేవతలు ఆలోచించి దేవగురువులైన బృహస్పతుల వారి కచుడిని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి ఆ విద్యని తెలుసుకోమని పంపిస్తారు. ఆలా కొన్ని రోజులకి శుక్రుడికి ప్రియ శిష్యుడిగా మరీనా కచుడు చివరకి అతడి దగ్గరి నుండి మృతసంజీవనీ విద్యను నేర్చుకొని దేవతలకి మేలు చేస్తాడని పురాణం.

Shukra Graha

ఇది ఇలా ఉంటె, శుక్రగ్రహం కూడా సూర్యుడి నుండే ఏర్పడిందని తెలిసినప్పటికీ రాక్షస గురువు కనుక ఇతడిని సూర్యపుత్రుడిగా చెప్పకుండా భృగువు కుమారుడని చెప్పారు ఎందుకంటే భృగువు అనే నక్షత్రానికి సమీపంలో శుక్రగ్రహం ఉండగా ఋషులు ఈ గ్రహాన్ని కనుగొన్నారు. అందుకే పురాణాల్లో ఇతడిని భృగుపుత్రుడని చెప్పారు.

Shukra Graha

SHARE