శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల ఆలయ విశేషాలు

తమిళనాడు లో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుత్తణి ఒకటి. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వంనుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. క్రీ.శ.875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనంలో, క్రీ.శ.907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడటంవల్ల 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతమవుతోంది.

Sri Subrahmanyaswamy Devalayamఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచిన ఈ క్షేత్రం తమిళులందరికి ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు.

Sri Subrahmanyaswamy Devalayamశ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుపక్కల పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ’ అని పిలవడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి ‘తణిగై’ లేదా ‘శాంతిపురి’ అనే పేరొచ్చింది. అలాగే ‘తణిగ’ అనే పదానికి మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చింది.

Sri Subrahmanyaswamy Devalayamసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి’ అనే ‘ఈటె’ను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి “జ్ఞానశక్తి ధరుడు” అనే పేరొచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.

Sri Subrahmanyaswamy Devalayamత్రేతా యుగంలో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరం లో ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రం దర్శించారు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది. ద్వాపర యుగంలో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచినారు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందారు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).

Sri Subrahmanyaswamy Devalayamదేవేంద్రుడు ఈ క్షేత్రంలో ఇంద్ర తీర్థంలో, “ కరున్ కువలై ” అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతీ రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పువ్వులతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే, ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న “ సంఘనీతి, పద్మనీతి, చింతామణి ” మొదలగు దేవలోక ఐశ్వర్యాలను తిరిగి పొందాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR