200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి దేవాలయం

బోనాల పండుగ అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. హైదరాబాద్ లో లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం లో శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ళ పుర్వానికి చెందినదని నమ్మకం. ప్రతి రోజు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఈ గుడిలో శక్తి కి మరియు అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు.

ఉజ్జయిని మహంకాళితెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ. జంట నగరాల్లో జరిగే అతి పెద్ద జాతర లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి, బోనాలు సమర్పిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి సికింద్రాబాద్ బోనాలను తిలకించేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలమంది భక్తులు ప్రతియేటా వస్తుంటారు. ఈ పండుగ దక్షిణాదిలో కుంభమేళా వంటి వాతావరణం కనిపిస్తుంది. పూర్వ కాలం నుంచి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించే సాంప్రదాయం ఉంది.

ఉజ్జయిని మహంకాళిపూర్వం నిజాం కాలంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ప్రాణాంతకరమైన మలేరియా వ్యాధి ప్రబరిలింది. చూస్తూ ఉండగానే చాలా మంది ఆ వ్యాధికి బలైయ్యారు. ప్రకృతి ప్రకోపాన్ని గమనించిన పెద్దలు ఆ ప్రకృతి మాతని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు, జాతరలు జరపాలని నిర్ణయించారు. ఈ జాతర ఉద్దేశ్యం భయకర, ప్రాణాంతకరమైన వ్యాదుల నుంచి కాపాడమని వెడుకోవాడమే. ఈ ఉత్సవానికి వారు పెట్టుకున్న పేరు బోనాలు. ఆషాడ మాసంలో దేవి పుట్టింటికి వెళుతుంది అని నమ్మకం అందుకు ఈ సమయంలో భక్తులు దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్దలతో, ప్రేమనురాగలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమార్పిస్తారు. ఈ తంతును “ఊరడి” అని అంటారు. వేరువేరు ప్రాంతాలలో పెద్ద ఇది పండుగ. బోనాల పండుగ ఆషాడ మాసంలో తొలి ఆదివారం నాడు గోల్కొండ నుంచి ప్రారంభం అవుతాయి. ఘట్టంతో అమ్మవారికి పూర్ణకుండ స్వాగతం అన్న మాట. ఆవాహన చేసిన కలషాలను పురవీధులలో ఊరేగింపు చేస్తారు.

ఉజ్జయిని మహంకాళిఈ బోనాలు ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వెలుతారు. ఇందుకోసం కొత్త కుండని వాడుతారు. కానీ నేడు ఇత్తడి లేదా సిల్వర్ బిందెలను వాడుతున్నారు. పరమ పవిత్రంగా నిష్టగా అన్నం వండి కుండలలో ఉంచి ఘట్టానికి కుంకుమ్మ, పసుపులతో , వేప ఆకులతో అలంకరించి పూజ మొదలు పెడుతారు. ఆ కుండ పై ఒక దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా మరియు ఆ ఘట్టాలని తీసుకొని వస్తారు. మంగళ వాయిద్యాలు , డప్పు చప్పుళ్లు, పోతారాజుల నృత్యాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా బోనం తలపై పెట్టుకున్న మహిళలను అమ్మ శక్తికి ప్రతికగా భావించి వారి కాళ్ళకు దండం పెట్టి వారి పాదాలకు నీటితో అభిషేకం చేస్తారు.

ఉజ్జయిని మహంకాళిఅమ్మకు అన్నం, జానపద భాషలో “సాకం” అంటే వండిన ఆహారం, పాకం అంటే వండనిది. వీటిని ప్రసాదంగా అందరికీ తిరిగి పంచుతారు. అమ్మవారికి సాకం సమర్పించడం సాంప్రదాయం కాబట్టి ఆ సంధర్భంగా వేప కొమ్మలను పసుపు నీటిలో ఉంచి అమ్మవారికి వండిన ఆహారాన్ని సమర్పిస్తారు. ఇలా ఇవ్వడానే సాకం అని అంటారు. ఇలా అమ్మవారికి సమర్పించడం వల్ల భవిష్యత్ లో అన్నపానాలకు లోటు రాకుండా ఉంటుంది అని భక్తుల నమ్మకం. గోల్కొండ కోటలో ఉన్న జగదాంబ అమ్మవారి ఆలయంతో ప్రారంభం అయ్యి ఈ ఉత్సవాని తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం ఆ తరువాత ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని లాల్ దర్వాజ సింహవాహిని ఆలయం, అక్కన మాధన్న మీదుగా నెలన్నర రోజుల పాటు సాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయాంలో జరిగే బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తారు. శివసత్తులతో పోతారాజుల నృత్యలతో, బోనం ఎత్తిన మహిళలతో అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు.

ఉజ్జయిని మహంకాళిఈ ఆలయంలో అమ్మవారికి 207 సం|| చరిత్ర కలదు. ఈ ఆలయం నిర్మాణంకు ప్రేరణ ఒక ఆర్మీ జవాన్ అంటే నమ్మగలరా? అవును ఇది నిజం. సికింద్రాబాద్ నివాసి అయిన “సూరటి అప్పయ్య” 1813 ప్రాంతంలో ఆర్మీలో డోలి బేరర్ గా పని చేసేవారు. అతను బదిలీ పై మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి వెళ్ళాడు. ఆ సమయంలో కలరా వ్యాధి ప్రబలి వేలాది మంది చనిపోయారు. అప్పడు అప్పయ్య ఉజ్జయినిలోని మహాకాళి మాతని దర్శించుకున్నారు. ఆ ప్రాంతం నుంచి కలరా వ్యాధి ప్రారధోలితే సికింద్రాబాద్ లో అమ్మవారికి విగ్రహం ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తాను అని మొక్కుకున్నారు. ఆయన కోరిక నెరవేరడంతో 1815 సం |లో ఇప్పుడు అమ్మవారు ఉన్న చోటునే అమ్మవారిని కట్టే విగ్రహం ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహాకాళిగా నామకరణం చేశారు. ఆ ప్రాంతం అంతా అప్పటి కాలంలో అడవిలాగా ఉండేది. ప్రక్కనే ఉన్న బావి మరమత్తు చేస్తూ ఉండగా అందులో శ్రీ మణిక్యాలమ్మ విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం అమ్మవారి కుడి వైపున ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి సూరటి అప్పయ్య గారి కుటుంబ సభ్యులు ఆలయ ధర్మ కర్తలుగా వ్యవహరిస్తున్నారు.

ఉజ్జయిని మహంకాళి1953లో దేవాదాయ ధర్మదాయ శాఖ ఈ ఆలయాన్ని అధీనంలోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుంది. ఈ ఆలయంలో రెండు రోజులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మొదటి రోజు బోనాల సమర్పణ, రెండవ రోజు ఘట్టాల ఊరేగింపు. ఈ రెండవ రోజు ప్రత్యేకమైనది. ఈ రోజున అమ్మవారు స్వర్ణ లత అనే మహిళాలోకి ప్రవేశించి భవిష్యవాణి వినిపిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR