Sensational Facts About Veerappan That History Never Told Us

0
4208

భారతదేశంలో పేరు గాంచిన స్మగ్లర్, అడవిలో అనువనువు తెలిసిన అతడు దాదాపుగా 30 సంవత్సరాలు మూడు రాష్టాల పోలీసులకు చుక్కలు చూపించి 184 మందిని చంపి, 900 ఏనుగులను చంపిన గజదొంగ వీరప్పన్. దేశంలో ఎన్నడూ లేని విధంగా వీరప్పన్ ని వేటాడి పట్టుకోవడానికి పెట్టిన ఆపరేషన్ కోసం 100 కోట్లు ఖర్చు చేయడం విశేషం. మరి వీరపన్న స్మగ్లింగ్ ఎలా చేసేవాడు? ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులు పెట్టుకున్న ఆపరేషన్ ఏంటి? వీరప్పన్ ఎలా దొరికాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 - veerapan

వీరప్పన్ పూర్తి పేరు మునుస్వామి వీరప్పన్. 10 సంవత్సరాల వయసులోనే వీరప్పన్ అడవి దొంగగా మారాడు. 17 సంవత్సరాల వయసులో మొదటి హత్య చేసాడు. అడవిలో కనిపించే ఏనుగులను చంపి వాటి దంతాలతో, గంధపు చెట్లని నరికి స్మగ్లర్ గా మారాడు. ఇక 1987 లో తమిళనాడుకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ చిదంబరాన్ని కిడ్నప్ చేసి చంపేశాడు. ఈ హత్యతో వీరప్పన్ పేరు మారుపొంగింది. 1991 లో కర్ణాటక రాష్ట్ర క్యాడర్ కి చెందిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి పందిళ్ళ పల్లి శ్రీనివాస్ ని అతి దారుణంగా చంపేశాడు. ఇలా అధికారులను చంపి హడలెత్తిస్తున్న వీరప్పన్ ని పట్టుకోవాలని 1993 లో 40 మంది పోలీసుల బృందం బయలుదేరగా వారిని ముందే పసిగట్టిన వీరప్పన్ మందుపాతర పెట్టి 22 మంది పోలీసులను అంతం చేసాడు.

2 - veerapan

ఇలా వీరపన్న అడవిలో స్మగ్లింగ్ చేస్తూ అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటే కర్ణాటక, తమిళనాడు పోలీసులు ఉమ్మడిగా కలసి వేట కొనసాగించినప్పటికీ అడవిలో ప్రతి దారి తెలిసిన వీరప్పన్ వారికీ దొరకలేదు. అయితే కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో సత్యమంగళం అనే అడవి ప్రాంతంలో వీరప్పన్ ఉండేవాడు. అయితే ఒకసారి వీరప్పన్ కుడి భుజం గురునాధన్ ని ఎస్సై షకీల్ కాల్చి చంపగా పగతో రగిలిపోయిన వీరప్పన్ అణువు చూసి ఎస్సై షకీల్ ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు.

3 - veerapan wife

ఇలా ఎదురు వచ్చినా వాళ్ళని అంతం చేసుకుంటూ వెళుతుండగా ప్రభుత్వం, పోలీసులు మొత్తం వీరప్పన్ పైన ద్రుష్టి పెట్టి ఒత్తిడి చేస్తున్న సమయంలో వీటి నుండి తప్పించుకోవడానికి అయన ఒక ప్లాన్ వేసాడు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అయితే 2000 సంవత్సరంలో జులై 30 వ తేదీన తమిళనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒక గ్రామానికి వచ్చిన రాజ్ కుమార్ ని వీరప్పన్ గ్యాంగ్ కిడ్నప్ చేసింది. ఈ కిడ్నప్ అప్పట్లో ఒక సంచలనం. కర్ణాటక అంత కూడా ఉలిక్కిపడింది. మా అభిమాన నటుడికి ఎం అవుతుందో అంటూ అయన అభిమానులు పెద్ద ఎత్తులో నిరసనలు తెలిపారు.

4 - veerapan

ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని సహాయం కోరగా, వీరప్పన్ మొదటి నుండి కూడా తక్కీరన్ అనే పత్రికకి మాత్రమే ఎప్పుడు ఇంటర్వ్యూ లు ఇస్తుండేవారు. అయితే నక్కీరన్ పత్రిక స్థాపకుడు గోపాల్ ని పిలిచి ప్రభుత్వం వీరప్పన్ దగ్గరికి రాయబారం పంపించగా అప్పుడు వీరప్పన్ కొన్ని చిత్రమైన డిమాండ్ లను చెప్పాడు. కావేరి జలాల వివాదంలో తమిళనాడుకి న్యాయం జరగాలని, పోలీసులు అరెస్ట్ చేసిన తమిళ తీవ్రవాదులను విడిచిపెట్టాలని, కర్ణాటకలో రెండో అధికార భాషగా తమిళాన్ని ప్రకటించాలని కొన్ని డిమాండ్లని చెప్పాడు.

5 - veerapan

ఇలా మొత్తం 109 రోజులు రాజ్ కుమార్ గారు వీరప్పన్ దగ్గర ఉండగా ఆయనకి ఎలాటి హాని చేయకుండా చివరకు క్షేమంగా విడిచిపెట్టాడు. అయితే ఇలా క్షేమంగా విడిచిపెట్టిందకు అయన దగ్గర వీరప్పన్ 30 కోట్లు వసూలు చేసాడని ఒక పోలీస్ అధికారి ఒక సందర్భంలో చెప్పాడు. ఇలా దశాబ్దాల పాటు అందరిని గడలాడించిన వీరప్పన్ ని పట్టుకోవడం కోసం 1991 లో మొదలైన ఆపరేషన్ కుకున్ 2004 లో వీరప్పన్ ని పట్టుకోగలిగింది.

6 - veerapan

వీరప్పన్ కి చెన్నై కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకు మంచి సాన్నిహిత్యం ఉందనే వార్తా పోలీసులకి తెలిసింది. అనారోగ్యం గా ఉందని, చూపు కూడా సరిగా కనిపించట్లేదు సరైన వైద్యం కావాలని, ఆయుధాలు కూడా కావాల్సిన అన్ని లేవని వీరప్పన్ ఆ పారిశ్రామికవేత్తకు చెప్పగా వైద్యం చేయిస్తానని దానికి సంబంధించి సమాచారం మల్లి చెబుతానని ఒక రహస్య గూఢచారి పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ పారిశ్రామికవేత్తని చుట్టూ ముట్టి తమిళ ఉగ్రవాదులతో నీకు సంబంధం ఉందని బయట చెప్పకుండా ఉండాలంటే వీరప్పన్ ని పట్టుకునేందుకు పోలీసులకు సహకరించాలని బెదిరించడంతో అతడు దానికి ఒప్పుకున్నాడు.

ఇలా వీరప్పన్ అడవి నుండి బయటికి వచ్చి వైద్యం చేయించుకోవాడానికి వారు అరేంజ్ చేసిన అంబులెన్సులో ఎక్కగా పోలీసులు సరైన సమయం చూసి ఒక దగ్గర కాల్పులు జరుపగా ఆ కాల్పుల్లో వీరప్పన్ మరణించాడు.

7 - raj kumar

ఇలా వందల కోట్ల గంధపు చెక్కలు స్మగ్లింగ్, వందల ఏనుగుల ప్రాణాలు తీసి గజ దొంగగా కొన్ని దశాబ్దాలు చుక్కలు చూపెట్టిన వీరప్పన్ చివరకు అడవి నుండి బయటకి రావడంతో పోలీసుల చేతికి చిక్కి మరణించాడు.

Read : Veerappan – Biography Of Veerappan  in English

SHARE