Home Health అవిసె గింజలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అవిసె గింజలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

అవిసె గింజలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే కానీ అవిసె గింజలు జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతాయి. జుట్టును మెరిసేలా మరియు చిగుళ్ళు చిట్లకుండా ఉంచడానికి అనేక ఉత్పత్తులు వాడుతుంటాం. కానీ వాటిలో విపరీతమైన రసాయనాలు ఉండి, జుట్టు రాలిపోవడానికి, విచ్ఛిన్నానికి లేదా రెండింటికి కారణమవుతాయి.

Health Benefits of Flaxseedsఅయితే అవిసె గింజల నుండి తయారు చేసిన జెల్ జుట్టు మెరిసేందుకు మరియు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. అవిసె గింజ జెల్ దినచర్యలో భాగం చేయడం వలన సహజమైన జుట్టు సంరక్షణకు సహాయపడతాయి. అవిసె గింజ జెల్ ఉపయోగించడం వల్ల జుట్టుకు హాని జరగకుండా ఫ్రిజ్ ను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇది జుట్టును బలపరుస్తుంది. జిడ్డు అవశేషాలను తలపై వదిలివేయదు. అవిసె గింజ‌ల్లోని ఒమెగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టులో తేమ‌ను పెంచి సిల్కీగా క‌నిపించేలా చేస్తాయి. అందుకే జుట్టు స‌మ‌స్య‌లున్న‌వారు వీటిని త‌ప్ప‌క తీసుకోవాల్సిందే. అవిసె గింజ‌లు జుట్టుకు మంచి మాయిశ్చ‌రైజేష‌న్‌, పోష‌ణ అందించ‌డం వ‌ల్ల త‌ల కూడా ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీనివ‌ల్ల చుండ్రు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ అవుతాయి. వీటిని తిన‌డంతో పాటు అవిసె గింజ‌ల నూనె పెట్టుకోవ‌డం, మంచి షాంపూతో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల చుండ్రు పూర్తిగా త‌గ్గిపోయే వీలుంటుంది.

చుండ్రు నిరోధక చికిత్సలో అవిసె గింజల ప్రయోజనం పొందడానికి, అర కప్పు అవిసె గింజలు మరియు అర కప్పు మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టండి. వీటిని పేస్ట్ చేయటానికి వాటిని బాగా రుబ్బి మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి పేస్ట్ కలపండి. ఈ పేస్ట్ ను మీ జుట్టుకు అప్లై చేసి, నీటితో కడగడానికి ముందు అరగంట ఆరబెట్టండి. తర్వాత హెర్బల్ షాంపూ లేదా కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. అవిసె గింజల్లో విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి తలమీద చర్మ చికిత్సకు, జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఫ్లాక్స్ సీడ్ జెల్ తో చర్మ కణాలను ఆరోగ్యంగా చేసి జుట్టును చిక్కగా మరియు పొడవుగా పెరగడానికి ప్రేరేపిస్తాయి. జుట్టు తెగి రాలిపోవ‌డాన్ని ఆపుతాయి. జుట్టుకు తేమనిచ్చి నిగనిగలాడే షైన్‌ని అందిస్తుంది.

జుట్టు చివరలు పెళుసుగా ఉంటే, పగులుతూ ఉంటుంది. అవిసె గింజల జెల్ ను రూట్ నుండి జుట్టు చివర వరకు అప్లైచేయడం ద్వారా, క్యూటికల్ ను మూసివేసి, జుట్టు పెళుసులుగా కాకుండా కాపాడుతుంది. ఇక ఇటీవ‌లి కాలంలో అబ్బాయిల‌కు బ‌ట్ట‌త‌ల సమ‌స్య బాగా పెరిగిపోతోంది. ఈ సమస్య ఉన్నవారు రోజూ అవిసె గింజ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. అవిసె గింజ‌లు బ‌ట్ట‌త‌ల‌కు దారితీసే ఎంజైమ్‌ల‌తో పోరాడి బ‌ట్ట‌త‌ల‌ను అడ్డుకుంటాయి. అవిసె గింజల జెల్ ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక చిన్న గిన్నెలో 2 కప్పుల నీటిని, 2 కప్పుల విత్తనాలను పోయాలి. సుమారు 10 నిమిషాలు వీటిని ఉడకనివ్వాలి. ఇవి మరుగుతుంటే నురగలు పైకి వస్తాయి. దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. నీళ్ళు జెల్ ఫాంలోకి రాగానే స్టవ్ ఆపేసి నీటిని ఒక పలచని గుడ్డలో వేసి వడకట్టాలి. చల్లారితే జెల్ బయటకు రావడం కష్టమవుతుంది.

వేడి చల్లబడిన తర్వాత ఈ జెల్ చిక్కగా ఉంటుంది. ఈ జెల్ ను తలకి కుదుళ్ళ నుండి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి. ఇలా ఒక ఇరవై నిమిషాలు వదిలేసి మామూలు నీటితో లేదా మైల్డ్ షాంపూతో కూడా శుభ్రం చేసుకోవచ్చు. దీనిని 15 రోజులు లేదా నెలకు ఒకసారి ప్రయత్నించడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ తయారవుతుంది. అంతేకాకుండా కుదుళ్ల నుంచి బలంగా, దృఢంగా తయారయ్యి జుట్టు పగుళ్ళు వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో చేసుకోవడం కష్టం అనుకుంటే మార్కెట్ లో చాల రకాల కంపెనీలకు సంబంధించిన అవిసె గింజల జెల్ దొరుకుతుంది. అయితే ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి ఎక్కువ రసాయన పదార్థాలు లేని జెల్స్ తీసుకోవడం మంచిది.‌ లేదా జెల్ ను ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవడం ఉత్తమం.

 

Exit mobile version