Home Unknown facts కర్ణుడి మరణానికి కారణం పూర్వజన్మ కర్మఫలమా

కర్ణుడి మరణానికి కారణం పూర్వజన్మ కర్మఫలమా

0

ధర్మం గాడి తప్పిన ప్రతిసారి శ్రీమహావిష్ణువు అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ చేసి, ధర్మాత్ములను రక్షించేవాడు. లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం ఒక్కోసారి ధర్మాన్ని కూడా పక్కన పెట్టవలసి వచ్చేది. మన పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు లోక సంరక్షణార్ధం ధర్మ విరుద్ధంగా ఎన్నో కార్యక్రమాలను చేశాడు. ధర్మం గాడి తప్పకుండా ఉండడం కోసం వివిధ రూపాలను అలంకరించి ధర్మాన్ని కాపాడాడు. దీనికోసం విష్ణుమూర్తి ఏకంగా పది అవతారాలను ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.

Reason Behind Karna's Deathఇందులో ఒకటి శ్రీకృష్ణ అవతారం అని మనకు తెలిసిందే. కృష్ణుని అవతారంలో విష్ణుమూర్తి కంసుడిని కర్ణుడిని మాయ చేసి చంపిన సంగతి మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాభారత యుద్ధమే జరిపించాడు. ఎంతో మంది ప్రాణాలు పోతుంటే చూసాడు. కంసుడి లాంటి దుర్మార్గులను చంపడం లోకానికి మంచి చేస్తే. కర్ణుడి లాంటి గొప్పవాణ్ణి చంపడం కూడా లోక హితమే, కానీ ఒక పుణ్యాత్ముణ్ణి మాయ చేసి చంపడం కృష్ణుణ్ణి చాలా బాధించింది. కానీ కర్ణుడు పూర్వ జన్మలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించాడు అనే విషయం చాలా మందికి తెలియదు.

పూర్వ జన్మలో కర్ణుడు ఒక రాక్షసుడు. పూర్వం సూర్యుని పుత్రుడిగా కర్ణుడు సహస్ర కవచకుండలాలను ధరించి సమస్త లోకాలను ఎంతో బాధించేవాడు. అయితే కర్ణుడుకి ఉన్న తపశ్శక్తి వల్ల దేవతలు సైతం కర్ణుడిని ఏమీ చేయలేకపోయారు. అయితే కర్ణుడు వల్ల ఎంతో విసుగు చెందిన దేవతలందరూ సాక్షాత్తు ఆ శ్రీహరి సాయం కోరారు. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కర్ణుడికి ఉన్న తపశ్శక్తి వల్ల అతనిని సంహరించడం వీలు కాదని భావించి విష్ణుమూర్తి నరుడు, నారాయణ రూపం ధరించాడు.

బద్రి ప్రాంతంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన నారాయణుడు కర్ణుడితో యుద్ధం చేసి తన రక్షణ కవచమును దూరం చేశాడు. అదేవిధంగా నర రూపంలో మరలా కర్ణుడితో తలపడి కర్ణుడికి ఉన్న అన్ని రక్షణ కవచాలను దూరం చేస్తూ చివరికి 999 రక్షణ కవచాలు దూరం కాగా, ఒక కవచంతో కర్ణుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. అప్పుడే ద్వాపర యుగం ప్రారంభం కావడంతో విష్ణుమూర్తి శ్రీకృష్ణుని అవతారమెత్తాడు. దుర్వాస మహర్షి మంత్రం ఫలితంగా కుంతీదేవి సూర్యుని వల్ల కర్ణుడికి జన్మనిస్తుంది.

ఈ విధంగా భూ లోకంలో జన్మించిన కర్ణుడిని విష్ణుమూర్తి తిరిగి కిరీటి, కృష్ణుడుగా ద్వాపరయుగంలో జన్మించారు. తాను ఎంత పుణ్యాత్ముడైనా, ధర్మాత్ముడైనా ధర్మం తప్పిన కౌరవుల పక్షాన చేరాడు. అందుకు కారణం పూర్వజన్మ కర్మఫలం అనుభవించాలి కాబట్టి.

ఆ తరువాత శ్రీకృష్ణుడు ఇంద్రుడు సహాయంతో కర్ణుడి చేత కవచ కుండలాలను దూరంచేసి అర్జునుడి చేత కర్ణుడిని సంహరించినట్లు మనకు భారతం తెలియజేస్తోంది.

 

Exit mobile version