పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

పనసపండు చూడ్డానికి కొంచెం భయానకంగా కనిపించినా దాని లోపల తొనలు మాత్రం ఎంతో రుచిగా ఉంటాయి. పనస తొనలు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని సైతం అందిస్తాయి. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే తప్పకుండా పనస తొనలు తినాలి. ఈ పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుదీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఏ, సి విటమిన్లు మాత్రం కాస్త స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. పనసపండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అజీర్తి, అల్సర్ల సమస్యను కూడా నయం చేస్తుంది. పనస పండులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుదీనిలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. జ్వరం, అతిసారతో బాధపడేవారు పనస తొనలు తింటే ఉపశమనం కలుగుతుంది. ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుబాగా మగ్గిన పండు మనో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది. చర్మ, కేశ ఆరోగ్యానికి కూడా ఔషధంగా పనిచేస్తుంది. మెగ్నీషియం, క్యాల్షియం ఉన్నందున ఎముకలను బలంగా చేస్తుంది.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుపనసపండులో ఉండే కాపర్ థైరాయిడ్ గ్రంధి పనితీరుని మెరుగుపరుస్తుంది. నిత్యం ఈ పండు తినడం వలన థైరాయిడ్ సమస్యలు రాకుండా కూడా అడ్డుకుంటుంది. వయసు పై బడే వారు కూడా పనసపళ్లు తింటే కంట్లో శుక్లాలు వచ్చే అవకాశం తగ్గడమే కాకుండా కాంతి సమస్యలు పోయి చూపు చక్కగా ఉంటుంది.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుపనసపండులో ఉండే ఐరన్, రక్తహీనత సమస్యను నివారిస్తుంది. రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది. పనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుంది. ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుతరచుగా పనస తొనలు తినడం వలన పురుషుల్లో శృంగార సామర్ధ్యం పెరుగుతుంది. వీర్య కణాల వృద్ది జరుగుతుంది. మగవారికే కాదు ఆడవారికి కూడా ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. చాలామంది ఆడవాళ్ళు కాల్షియం లేమితో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు పనస తొనలు తింటే మంచిది. పాలలో కంటే పనస తొనల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఎదిగే పిల్లలు వీటిని తినడం వలన ఎముకలు దృఢంగా తయారవుతాయి.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఆరోగ్యంగా ఉంచడంలోనే కాదు అందాన్ని ఇవ్వడంలో కూడా పనస పాత్ర అమోఘం. ఏజింగ్ సమస్యలను దూరం చేసి మొహంపై ముడతలు పడకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. పనసపండులో ఉండే న్యూట్రీషియన్ విటమిన్ ఏ ఐ విజన్ ను మెరుగుపరుస్తుంది. హెయిర్ క్వాలిటీని పెంచుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుపనస తొనలే కాదు పనస గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పనస గింజల్లో తేమ చాల తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలు ఇంకా కఠినంగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లల్లో జీర్ణశక్తి ఎక్కువ కాబట్టి ఈ పండు గింజలను కాల్చి తింటే, వారికంత అపకారం జరగదు.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఅయితే, ఈ పండును మధుమేహ రోగులు తినోచ్చా? ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. పనస పండులో ఉండే సహజసిద్ధ చక్కెర్లు, ఫైబర్ ఉంటాయి. మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది. అలాగే, మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.

పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుపచ్చి పనస కాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్‌కు బదులు పనస పండ్లను తిన్నట్లయితే.. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే ఏదైనా సరే మితంగా తినాలి. ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా ఈ పండును తింటే కొత్త సమస్యలు వస్తాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR