వేసవి వచ్చిందంటే అందరి చూపు పుచ్చకాయలపైనే ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. పైగా టేస్టీగా ఉంటుంది. దీంతో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వాటర్ మిలన్ ను తింటారు. పుచ్చకాయ యొక్క చల్లని రసం మన దాహాన్ని తీరుస్తుంది. మరియు వేడిలో అలసిపోయిన మనల్ని రిఫ్రెష్ చేస్తుంది. అయితే రుచితో పాటు చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.
ముఖ్యంగా హైబీపీ విషయంలో బాగా పని చేస్తుందట. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తనాళాల గోడలపై రక్తం కలిగించే పీడనం నిరంతరం ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అంటారు. 140/90 కన్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే అప్పుడు హైబీపీ ఉందని చెబుతారు. 180/90 బీపీ ఉంటే అప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రాణాంతక పరిస్థితికి చేరుకుంటారు.
అయితే ఈ సీజన్‌లో ఎక్కువగా లభించే పుచ్చకాయలు తినడం వల్ల హైబీపీ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పుచ్చకాయల్లో ఉండే పలు ఔషధ గుణాలు హైబీపీని తగ్గిస్తాయట. ముఖ్యంగా వాటిలో ఉండే పలు యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలను వెడల్పుగా చేస్తాయట. దీంతోపాటు రక్తపోటును కూడా నియంత్రిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలు తినడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చనివారు చెబుతున్నారు. హైబీపీ మాత్రమే కాదు పుచ్చకాయతో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కంటి కోసం: పుచ్చకాయలో ఉండే లైకోపీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ కంటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి, అలాగే పుచ్చకాయ వయసు ఆధారిత మక్యూలర్ డిజెనెరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
* మూత్రపిండాలకు: పుచ్చకాయ ఒక మూత్రవిసర్జకారి (డైయూరేటిక్), ఇది శరీరం నుండి అదనపు సాల్ట్ లను మరియు టాక్సిన్లను తొలగించడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
* గర్భిణీ స్త్రీలకు: పుచ్చకాయ గర్భిణీ స్త్రీలలో సంభవించే రుగ్మతలైన ప్రీఎక్లంప్సియా మరియు గర్భాశయంలో పెరుగుదల తగ్గిపోవడం తగ్గిపోవడం వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
* క్యాన్సర్ కోసం: పుచ్చకాయలో ఉండే లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.