యాలకులు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0
476

సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి. ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఇవి మూడోవి. యాలకుల రుచి, సువాసన కారణంగా స్వీట్స్ తయారీలో వీటిని ఎక్కువుగా ఉపయోగిస్తారు. వంటకాలకు మంచి సువాసనను తెచ్చే యాలకులు ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడతాయి. తరచూ యాలకులు తినేవారికి అనారోగ్యాల బెడద తక్కువని నిపుణులు చెబుతున్నారు.

Health Benefits of Elachiప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు. ఈ మద్య కాలంలో బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది.

Health Benefits of Elachiయాలకుల్లోని పొటాషియం, మెగ్నీషియం గుండెకు మేలు చేస్తాయి. రోజుకో కప్పు యాలకుల టీ తాగితే హృదయారోగ్యానికి మంచిది. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు యాలకుల టీ తాగితే మెదడుకు ప్రాణవాయు సరఫరా పెరిగి తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.

Health Benefits of Elachiయాలకుల వాడితే అధిక రక్తపోటు త్వరగా అదుపులోకి వస్తుంది. ఆస్తమా కారక జలుబు, దగ్గు ఉన్నవారు యాలకులు నమిలి చప్పరిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వికారం, కడుపుబ్బరం వంటి ఇబ్బందులకు యాలకులు ఔషధంగా పనిచేస్తాయి. రోజూ 2 యాలకులు తింటే శరీరంలోని చేరిన హానికారక వ్యర్థాలు వదిలిపోతాయి.

Health Benefits of Elachiఇక చాలా మంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపోయి హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు. అలాగే నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది. రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది.

 

SHARE