మీ చర్మతత్వం ఏంటో ఈ చిట్కాలతో తెలుసుకోండి!

0
1461

చర్మం అందంగా ఉండాలని ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ తెచ్చుకుని వాడుతారు కొంతమంది. కానీ అలా కాకుండా.. పెరగాల్సిన అందం తరుగుతూ ఉంటే.. ఏదో పొరపాటు చేశారన్నమాట. అంటే చర్మానికి తగ్గ సౌందర్య ఉత్పత్తిని ఎంచుకోలేదనే అర్థం. పైగా ఒక్కో బ్యూటీ ప్రొడక్ట్ ఒక్కో రకమైన స్కిన్ టైప్ కి మాత్రమే పని చేస్తుంది. కాబట్టి సౌందర్య ఉత్పత్తులు ఎంచుకునే ముందు మీ చర్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి అదెలాగో చూద్దాం.

Skin Typeచర్మం జిడ్డుదా? పొడిదా? లేదా మిశ్రమ చర్మతత్వం కలిగినదా అనేదాన్ని ప్రధానంగా నిర్ణయించేవి జన్యువులే. వాతావరణం, హార్మోన్లు, తినే ఆహారం కూడా చర్మం ఎలా ఉండాలో నిర్దేశిస్తాయి. అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి మనం వేసుకునే ఔషధాలు సైతం చర్మంపై ప్రభావం చూపిస్తాయి. అయితే
ఓ చిన్న టెస్ట్ చేసుకోవడం ద్వారా స్కిన్ టైప్ ఎలాంటిదో గుర్తించవచ్చు.

Skin Typeదాని కోసం ఏం చేయాలంటే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనికోసం క్లెన్సర్ లేదా సబ్బు ఉపయోగించవచ్చు. మెత్తటి టవల్ తో చర్మాన్ని తుడుచుకోవాలి. ఆ తర్వాత చర్మానికి ఏమీ అప్లై చేయకూడదు. మాయిశ్చరైజర్, క్రీమ్ ఏమీ రాసుకోవద్దు. అలాగే చేతితో తాకవద్దు.

ముఖం శుభ్రం చేసుకున్న గంట తర్వాత చర్మం బిగుతుగా, దురదగా, అక్కడక్కడా పొడిగా ఉన్నట్లయితే పొడి చర్మం(డ్రై స్కిన్).

టీ జోన్ లో జిడ్డుగా, మెరుస్తున్నట్టుగా ఉంటే.. జిడ్డు చర్మం(ఆయిలీ స్కిన్).

Skin Typeటీ జోన్ లో జిడ్డుగా, బుగ్గలు, చెంపల దగ్గర పొడిగా లేదా సాధారణంగా ఉంటే మిశ్రమ చర్మం(కాంబినేషన్ స్కిన్).

పొడిగా లేదా జిడ్డుగా లేకుండా సాధారణంగా ఉంటే..నార్మల్ స్కిన్.

Skin Typeకొన్నిసార్లు ఎర్రగా, కొంచెం దురద పెడుతున్నట్టుగా లేదా మండుతున్నట్టుగా ఉంటే.. సున్నితమైన చర్మం(సెన్సిటివ్ స్కిన్).

ఈ చిట్కాను పాటించి.. మీ స్కిన్ టైప్ ఏదో తెలుసుకుని మీ చర్మానికి తగ్గ ఉత్పత్తులు ఎంచుకోండి.