Home Health పాము కాటుకు గురైనప్పుడు చేయవల్సిన ప్రధమ చికిత్స ఏంటి ?

పాము కాటుకు గురైనప్పుడు చేయవల్సిన ప్రధమ చికిత్స ఏంటి ?

0

ఇదివరకటి రోజుల్లో వైద్యం అంతగా అందుబాటులో ఉండేది కాదు కాబట్టి పాము కాటుకి నాటు వైద్యం చేసేవారు. కట్లు కట్టడం, ఆకు పసరు పోయడం లాంటి పద్ధతులు పాటించేవారు. అవి అన్నీ సార్లు ఫలిస్తాయని గ్యారంటీ ఉండేది కాదు. పైగా వాటి వలన ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. కాబట్టి ఎవరినైనా పాము కాటు వేసినపుడు వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.. పసరు నాటు వైద్యాల జోలికి వెళ్ళవద్దు. అయితే ముందు వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో వారికి కొంచెం ప్రాధమిక చికిత్స చేయొచ్చు.

first aid for snake biteముందు వారిని ఆందోళన చెందద్దు అని చెప్పాలి. బీపీ, షుగర్ ఉన్నవారు అసలు కంగారు పడకూడదు. గాలి ఆడేలా ఆ వ్యక్తి ఉండాలి. పాము కాటుకు గురైన వారిని ముఖ్యంగా నిద్ర పోకుండా చేసుకోవాలి. ఇక ఆ కాటు వేసిన ప్రాంతం దగ్గర రఫ్ చేయడం ఐస్ పెట్టడం, వేడి బొగ్గు క్లాత్ పెట్టడం ఇలాంటివి చేయకండి. ఇది డేంజర్ దీని వల్ల వాపు పెరుగుతుంది అవయవం దెబ్బ తింటుంది.

పాము కాటు వేస్తే చాలా మంది నోటితో ఆ విషం తీస్తాం అంటారు. అలా చేయడం ప్రమాదకరం. కొంతమంది కత్తితో గాటు పెట్టి విషాన్ని తీయడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వలన అధిక రక్తస్రావం జరుగుతుంది. అది కూడా ప్రమాదమే. పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయటం అస్సలు చేయవద్దు.

పాము కరిచిన చోట కట్టుకట్టటం వంటివి చేస్తే వాపు మరింత ఎక్కువైతే ఆ ఏరియా తొలిగించాల్సి ఉంటుంది. అందుకే అలా చేయకూడదు. ఇక ఆకులు పసరు ఇలాంటివి వాడే కంటే ముందు వైద్యులు ఇచ్చే ఇంజెక్షన్ తీసుకోవాలి.

 

Exit mobile version