మన దేశంలో పరమ శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు చాలానే ఉన్నాయి. శివుడు ప్రతి ఆలయంలో మనకి లింగ రూపంలోనే దర్శనం ఇస్తుంటాడు. ఇలా ఆ స్వామి వెలసిన ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత ఉంది. అయితే మన దేశంలో ఉన్న ఈ ఐదు శివలింగాలు చూడటానికి ఒక అధ్భూతం అనే చెప్పాలి. మరి మంత్రముగ్దుల్ని చేసే ఆ ఐదు శివలింగాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి? ఆ శివలింగంలో ఉన్న ప్రత్యేకత ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అమరనాథ్ దేవాలయం:
ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఇది ప్రధానంగా గుహ దేవాలయంగా వుంది. ఇది సంవత్సరంలో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే కనిపించే శివలింగం. ఈ శివలింగం స్వయంగా మంచుగాడ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినది. ఈ ఆలయం వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ శివలింగాన్ని దర్శించుకొనుటకు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు వేసవిలో అమర్నాధ్ కి తరలి వస్తారు.
నర్మదా నది తీరం వద్ద శివలింగం:
మధ్యప్రదేశ్ లో వున్న మహేశ్వర్ లో నర్మదా నదిలో ప్రతిష్టించబడివున్న ఈ శివలింగం అత్యంత అద్భుతమైనది. శివ లింగానికి ఎదురుగా నందిస్వామి వెలసియున్నాడు. పురుషుడు మరియు ప్రకృతి సమాగమాన్ని సూచించే ఈ శివలింగం స్థలం అత్యంత పవిత్రమైంది. ఇక్కడ స్నానమాచరించిన సకలపాపాలు పరిహారమౌతాయి అని నమ్ముతారు.
బృహదీశ్వర దేవాలయం:
తమిళనాడులోని అనేక శివలింగ దేవాలయాలున్నాయి. అందులో బృహదీశ్వర దేవాలయం తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన మరియు ప్రసిద్ధమైన దేవాలయం. ఈ దేవాలయం అనేక విశేషాలను కలిగి, అత్యంత పవిత్రమైన యాత్రా స్థలంగా వుంది. ఇక్కడి శివలింగం ఏకశిలతో చేయబడిన భారీ శివలింగం ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తుంది.
కేదారేశ్వర దేవాలయం:
మహారాష్ట్రలోని హరిశ్చంద్రఘడ్ లో వున్న కేదారేశ్వర దేవాలయంలో అత్యంత మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ ఆలయం నాలుగు స్తంభాలు కలిగివున్న ఒక ఒక గుహ ఆలయం. అయితే ఆ నాలుగు స్తంభాలలో ఇప్పటికే 3 స్తంభాలు నాశనం చేయబడ్డాయి ఇంక మిగిలినది ఒకే ఒక స్థంభం. ఈ స్తంభంపడిపోతే యుగాంతం వస్తుందని చెప్పబడినది.
ముఖ లింగం:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలోని ఉదయగిరి గుహలో అత్యంత అరుదైన శివలింగం ఉంది. ఇది ఒక ముఖాన్నికలిగివున్నశివ లింగమైనా దీనిని ముఖలింగం అనే పిలుస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన నమూనాను కలిగి ఉన్న శివలింగం.
ఇలా ఎన్నో శివలింగాలు ఉండగా ఈ ఐదు శివలింగాలు దర్శిస్తే రెండు కళ్ళు చాలవని ఈ శివలింగాల దర్శనం ఒక అద్భుతమని చెబుతారు.