తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోడానికి శరీరం అన్నివేళల్లోనూ నిర్వహించే ప్రాధమిక విధి జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ మనిషి నిద్రలో ఉన్నప్పటికంటే మేలుకొని ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతుంది. జీర్ణక్రియ అనేది ఆహారాన్ని నమలడం నుండి ప్రారంభమై వ్యర్థాల విసర్జన (మలవిసర్జన) తో ముగుస్తుంది. కానీ, ఈ ప్రక్రియ శాశ్వతమైనది, జీర్ణక్రియ అన్ని సమయాల్లో వివిధ దశల్లో జరుగుతుంది. ఆహారము నుండి మనం పొందిన శక్తిని శరీరానికి అందించేందుకు తోడ్పడేదే జీర్ణక్రియ.
శరీర అవయవాలు మరియు కణజాలాలకు పోషణను అందించడంలో జీర్ణక్రియ సహాయపడుతుంది. జీర్ణక్రియ లోపాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియ అనేది మొత్తం ఆరోగ్యం యొక్క ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నందున, జీర్ణక్రియ సరిగా జరగకపోతే ఖచ్చితంగా వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది మరి మీరు జీర్ణక్రియపట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అది ఎలాగో పరిశీలిద్దాం.
యాపిల్స్:
యాపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు యాపిల్ తింటే , జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు . భోజనం చేసిన 15 నిముషాల తర్వాత ఒక్క ఆపిల్ ను తినడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.
పియర్స్:
పియర్స్(బేరిపండు)చాలా బెస్ట్ ఫుడ్. ఈ పండును కనీసం వారంలో ఒక్కసారైనా తీసుకోవాలి. రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం, బేరిపండు ఫైబర్ ను పుష్కలంగా అంధిస్తుంది. ఈ ఫైబర్ స్మూత్ స్టూల్ గా మారుతుంది. పియర్స్ లో సోడియం ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, మరియు 190గ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది ఒక్కటి చాలు మంచి జీర్ణక్రియ కోసం
రాస్బెర్రీ:
మధుమేహగ్రస్తులు ఎవరైతే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వారు రాస్బెర్రీస్ ను తినడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఈ చిన్న చిన్న బెర్రీస్ లోనే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ కంటెంట్ ను తగ్గిస్తుంది. అంతే కాదు ఇవి లోక్యాలరీ ఫుడ్ . కాబట్టి, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
బొప్పాయి:
మీరు తిన్న ఆహారం 24గంటల్లో జీర్ణం అవ్వడానికి పచ్చిబొప్పాయి సహాయపడుతుంది . ఈ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లూజ్ మోషన్ అయినప్పుడు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తుంది. మరియు బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ గా విచ్చిన్నమై, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.
అరటిపండ్లు:
అరటిపండ్లు నార్మల్ బౌల్ ఫంక్షన్స్ కు సహాయపడుతాయి . అందువల్ల వీటిని ఉదయం పరగడపున తినడం లేదా భోజనం తర్వాత తినడం మంచిది . ఏవిధంగా తీసుకొన్నా ఆహారంను సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.
ఫిగ్స్:
ఒక కప్పు డ్రైడ్ ఫిగ్స్ లో 15 గ్రాముల ఫైబర్ ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఒక కప్పు ఫిగ్స్ తినడం వల్ల జీర్ణక్రియ మరింత బెటర్ గా ఉంటుంది.
పైనాపిల్:
పైనాపిల్ తినడానికి పుల్లగా అనిపించవచ్చు. కానీ, దాని వెనుక అనేక ఆరోగ్యరహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఫ్రూట్ జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. మరియు ఇందులో ఉండే బ్రొమోలిన్ అనే ఎంజైమ్ తిన్న ఆహారంను బ్రేక్ చేయడానికి బాగా సహాయపడుతుంది.