పని ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు.. ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ప్రారంభంలోనే వీటిని గుర్తించి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి. లేదంటే కళ్ల కింద నల్లటి మచ్చలు అలాగే ఉండిపోవడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. సౌందర్య ఉత్పత్తులను వాడటం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు.
కానీ వాటిలోని రసాయనాలు హానికరం. ఈ వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటిస్తే రెండు రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. అవేంటో చూద్దాం.
నిద్ర:
చాలా కాలం నుండి సరైన నిద్రలేక, నిద్రలేమితో బాధపడుతుంటే, అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. అంతే కాదు, నిద్రలేమి వల్ల ముందుగా ప్రభావితం అయ్యేది కళ్ళు, కళ్ళ చుట్టూ నల్లని వలయాలు. కళ్ళు కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, కళ్ళు తిరిగి ఆరోగ్యకరంగా కనబడాలంటే, తగిన జాగ్రత్తలు తీసుకొని చైతన్యం నింపడం అవసరం. మరో ఉత్తమమార్గం ప్రతి రోజూ టైమ్ కు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
కీరదోసకాయ:
డార్క్ సర్కిల్స్ నివారించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ మార్గం. కీరదోసకాయ ఒక మంచి ఆస్ట్రిజెంట్ మరియు స్కిన్ టోనర్. కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా ఒక రోజులో రెండు మూడు సార్లు రిపీట్ చేయండి. ఇది కళ్ళను విశ్రాంతి పరచడం మాత్రమే కాదు, డార్క్ సర్కిల్స్ ను కూడా తగ్గిస్తుంది.
నీళ్ళు:
ప్రతి రోజూ శరీరానికి తగినంత నీటిని త్రాగడం వల్ల నల్లని వలయాలు ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి .డార్క్ సర్కిల్స్ నివారించడంలో చాలా సులభమైన రెమెడీ ఇది . ఇది మీ చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచి మరియు డార్క్ సర్కిల్స్ తో పోరాడుతుంది.
టీ బ్యాగ్స్:
డార్క్ సర్కిల్స్ ను నివారించడానికి మరో ఎఫెక్టివ్ మార్గం ఇది. మీరు ఉదయం టీ త్రాగిన తర్వాత మీరు ఆ టీబ్యాగులను ఫ్రిజ్ లో నిల్వ చేసి తర్వాత ఉపయోగించుకోవచ్చు . మీకు సమయం ఉన్నప్పుడు, ఫ్రిజ్ లో పెట్టిన టీ బ్యాగ్స్ ను బయట పెట్టి, గది ఉష్ణోగ్రతకు నార్మల్ గా రాగేనే వాటిని కళ్లమీద పెట్టుకోవాలి.
టమోటో:
టమోటోలో మీ చర్మం రంగును మరింత పెంచడానికి సహాయపడే లక్షణాలు ఉన్నాయి. అందుకు ఒక చెంచా టమోట గుజ్జు మరియు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి డార్క్ సర్కిల్స్ ఉన్నప్రదేశంలో అప్లై చేసి కొన్ని నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
బాదం ఆయిల్:
బాదం ఆయిల్ ఇది ఒక నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇది మంచి చర్మ సౌందర్యంకు చాలా అద్భుతమైనటువంటిది. నల్లటి వలయాలున్న వారు, తొలగించుకోవడానికి ఈ బాదం నూనెను రెగ్యులర్ గా మీ కళ్ళ చుట్టు మసాజ్ చేయాలి . ఇలా ప్రతి రోజూ నిద్రించడానికి ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . మరింత మంచి ఫలితాల కోసం, ఆలివ్ నూనెను కూడా తీసుకొని బాదం నూనెలో మిక్స్ చేసి మసాజ్ చేసుకోవచ్చు.