డెలివరీ తరువాత బరువు పెరగకుండా ఈ చిట్కాలు పాటించండి ?

గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడం అనేది సాధారమైన విషయమే. కొంతమంది ప్రసవం తరువాత బరువు తగ్గిపోతారు. కానీ, కొంతమంది మహిళలు మాత్రం ప్రసవం అయిన తరువాత కూడా బరువు తగ్గకపోగా ఇంకా బరువు పెరుగుతారు.

tips to not gain weight after deliveryబరువును అదుపులో పెట్టుకోడానికి చాలామంది వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ, ప్రసవం తరువాత ఎటువంటి ఒత్తిడి పడకూడదని, అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. కాబట్టి దాని వల్ల డెలివరీ తర్వాత ఎక్కువ బరువు పెరుగుతారు. మరి ప్రసవం తరువాత బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

tips to not gain weight after deliveryబరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణంగా చాలామంది చేసే పెద్ద తప్పు భోజనం తినకుండా ఉండటం లేదా తక్కువ తీసుకోవడం. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతామని అనుకుంటారు. నిజానికి అది పొరపాటు. రోజులోని ముఖ్యమైన భోజనాన్ని తీసుకోకపోవడం వల్ల శరీరం ఆకలితో ఉంటుంది. శరీరంలోని జీవక్రియ ప్రక్రియ కూడా మందగిస్తుంది. ఇలా మందగించడం వల్ల మీరు తినే పరిమిత ఆహారం నుండి ఎక్కువ కొవ్వును తీసుకోవడమే కాకుండా దాన్ని శరీరంలో నిల్వ చేస్తుంది. ఇది మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది.

tips to not gain weight after deliveryఇలా భోజనాన్ని మానెయ్యటానికి బదులుగా ఆహారంలో కావలిసిన పోషకాలు ఉండేలా భోజనాన్ని మార్చుకోవచ్చు. ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం కంటే, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం బరువు తగ్గే విషయంలో మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రసవం తరువాత షుగర్, వేయించిన ఆహార పదార్ధాలను తినడం పూర్తిగా మానెయ్యాలి. ఈ సమయంలో శరీరానికి విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు వంటి సరైన పోషకాలు అవసరం, వీటిని ఆరోగ్యకరమైన ఆహారాల నుండి సులభంగా పొందవచ్చు.

tips to not gain weight after deliveryఇంకా చాలా మంది నిద్ర ఎక్కువ పోవడం వల్ల శరీర బరువు పెరుగుతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. తగినంత నిద్రపోవడం వల్ల ఎనర్జీ రావడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన ధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గుతారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR