మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారపదార్ధాలు

0
498

కరోనా నేపథ్యంలో ఎక్కువగా వినబడుతున్న మాట రోగనిరోధక శక్తి. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటే ఎటువంటి వైరస్ అయినా మన శరీరం పైన ప్రభావం చూపలేదు. రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. మనలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు అవేంటో తెలుసుకుందాం.

Immunity Booster Foods-> విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమోటా, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది.

Immunity Booster Foods-> గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.

Immunity Booster Foods->ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.

Immunity Booster Foods-> ప్రతిరోజు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి. దీనిలో ఉండే మినరల్స్ బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

Immunity Booster Foods->రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది. దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీనివల్ల అధిక రక్తపోటుని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Immunity Booster Foods->శరీరానికి విటమిన్-డీ అవసరం .. ఉదయం ఎండలో డి విటమిన్ లభిస్తుంది. ఉదయాన్నే ఎండలో కాసేపు నిలబడడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా ఉదయం ఖచ్చితంగా 15-20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

Immunity Booster Foods->మధ్యపానం.. ధూమపానం రెండింటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉంటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

Immunity Booster Foods->ప్రతి మనిషి తప్పనిసరిగా 7-8 గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ప్రతీరోజు ఒకే సమయంలో నిద్రపోయే విధంగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

Immunity Booster Foodsఇవన్నీ పాటిస్తే మనలో రోగనిరోధకత పెరిగి వ్యాధులు చుట్టుముట్టవు అని వైద్యులు సూచిస్తున్నారు.

 

SHARE