ఒత్తిడికి గురైనప్పుడు ఉపశమనం కలిగించే ఆహారపదార్ధాలు ఏంటో తెలుసా ?

ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి. శారీరకంగానైనా.. మానసికంగానైనా మన జీవితంలో అదొక భాగమైపోయింది. శారీరక శ్రమ తగ్గిపోవడం, పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఒత్తిడి, ఆందోళన బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యపై దృష్టి పెట్టకపోతే దీర్ఘకాలంలో ఇతర తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బాగా ఒత్తిడికి గురైనా, కోపం వచ్చినా మన శరీరంలో కార్టిసోల్‌, అడ్రినలిన్‌ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మన శరీరం మరింత ఉత్తేజితమై, వాటి ప్రభావం కండరాలమీద పడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. తరచూ ఒత్తిడికి గురవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడిఒత్తిడి, ఆందోళన వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల ఆకలి పెరగడం, మధుమేహం, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని రకాల పోషకాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయని పరిశోధనల్లో తేలింది. సహజ మార్గాల్లో మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పదార్థాలు కృషి చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడిమన శరీరానికి హాని చేసే ఈ ఒత్తిడిని తగ్గించడానికి తాజా పండ్లు, కూరగాయలు చాలా బాగా ఉపయోగపడతాయిట. ఈ విషయం ఎడిత్‌ కొవాన్‌ యూనివర్శిటీ పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. పండ్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం తీసుకుంటే చాలా వరకు ఒత్తిడి తగ్గుతుందని తేలింది. ఒత్తిడి అదుపులో ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 400 గ్రాములకు తగ్గకుండా పండ్లు, కూరగాయలు తినాలని, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా సూచిస్తోంది. ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. మరీ అవెంటో తెలుసుకుందామా.

నిమ్మజాతి పండ్లు:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుసిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివి పండ్ల నుంచి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని పరిశోధనల్లో తేలింది. విటమిన్ సి పెరిగిన కార్టిసాల్ స్థాయిలను నివారించడం ద్వారా శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని అధ్యాయనాల్లో వెల్లడైంది. కార్టిసాల్ అనేది “ఫ్లైట్ లేదా ఫైట్” హార్మోన్. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యను సి విటమిన్ దూరం చేసి, మనసిక అనారోగ్యాలకు దూరంగా ఉంచుతుంది. నిమ్మజాతి పండ్లలో కమలాది ఓ ప్రత్యేక స్థానం. కాబట్టి ఒత్తిడికి గురయ్యే వారు తరుచూ సిట్రస్ పండ్లను తినడం మంచిది.

కార్బోహైడ్రేట్లు:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుమెదడు పనితీరుపై ప్రభావం చూపే సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లు సహాయపడతాయి. సెరోటోనిన్ సంతోషం, వెల్‌బీయింగ్‌కు కారణమవుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి సమస్యలను దూరంచేసి, శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి లభించేలా చేస్తుంది. మెదడులో సెరోటోనిన్ స్థాయులు తక్కువగా ఉంటే, మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది. ట్రైప్టోఫాన్ అనే ఎమైనో యాసిడ్ వల్ల మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అధికంగా లభించే సోయాబీన్స్, బఠానీ, ఇతర ధాన్యాలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.

చేపలు:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పోషకం ఎక్కువగా లభించే సాల్మన్, ట్రౌట్, మాకెరెల్ వంటి చేపలు, ఇతర సీ ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటినుంచి లభించే DHA , EPA అనే యాసిడ్లు ఒత్తిడిని దూరం చేసి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి వల్ల శరీరంలో ఏర్పడే మంటను, కార్టిసోల్ స్థాయులను కూడా ఇవి తగ్గించి ఒత్తిడిని నియంత్రిస్తాయి. చేపలలో ఉండే ఈ ఫ్యాటీ యాసిడ్లను ఎక్కువగా తీసుకుంటే డిప్రెషన్ నుండి కూడా కాపాడుకోవచ్చని పరిశోధనల్లో కనుగొన్నారు.

తృణధాన్యాలు:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుతృణధాన్యాల నుండి వచ్చే కాంప్లెక్స్ పిండి పదార్థాలు రక్తప్రవాహంలోకి వెళ్ళి బలంగా ఉండేందుకు సహయపడతాయి. తొందరగా మానసిక ఒత్తిడికి గురవకుండా చూసుకుంటాయి. . పిండి పదార్థాలు మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనాన్ని పెంచుతాయి. దీనిని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. రోజూ తీసుకునే ఆహారంలో ఓట్స్, మొత్తం గోధుమలు, క్వినోవా, బార్లీ లేదా ఇతర తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. గోధుమలలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను సరఫరా చేసిఒత్తిడిని నివారిస్తుంది.

టీ:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుసాధరణంగా మనం చేస్తున్న పని నుంచి కాస్త విశ్రామం తీసుకోవడానికి టీని ఎక్కువగా తీసుకుంటుంటాం. ముఖ్యంగా గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ నరాలను ఉపశమనం చేస్తుంది. చమోమిలే (చామంతి) టీ ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి.. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా వాలరీ రూట్, పాషన్ ఫ్లవర్ యొక్క కషాయాలను తీసుకోవడం వలన ఒత్తిడిని తగ్గిస్తాయి.

బొప్పాయి:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుబొప్పాయిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని బయటకు పంపుతుంది. దీంతో శరీరం, మనసు తేలికపడి ఒత్తిడి తగ్గుతుంది. దీని ద్వారా లభించే విటమిన్‌ సి ఒత్తిడిని ప్రభావితం చేసే హార్మోన్లను నియంత్రిస్తుంది.

విటమిన్ B12:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలువిటమిన్ B12, ఇతర B విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తూ, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. ముస్సెల్, క్లామ్స్, ఆయిస్టర్స్ వంటి షెల్ ఫుడ్స్‌ నుంచి విటమిన్ బి12 శరీరానికి అందుతుంది. ఇతర మాంసాహారంలో కాలేయం ఈ పోషకానికి వనరుగా ఉంటుంది. విటమిన్ బి, బి12 లోపాల వల్ల చిరాకు, బద్ధకం, డిప్రెషన్ వంటి ఒత్తిడి సంబంధిత లక్షణాలు అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. ఇవి శరీరానికి అందేలా చూసుకోవడం వల్ల మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. విటమిన్ బి12 శాకాహారం నుంచి పెద్దగా లభించదు. వీరు డాక్లర్ల సలహాలతో బి12 సప్లిమెంట్లు తీసుకోవాలి.

అశ్వగంధ:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుఆయుర్వేదం ఆందోళనను, నిరాశతో తగ్గించడానికి సహయపడుతుంది. బ్రహ్మ ఆయుర్వేద నాడి టానిక్. ఇది 3000 సంవత్సరాలుగా యాంటీ-యాంగ్జైటీ ఔషదంగా ఉపయోగిస్తున్నారు. అశ్వగంధ ఒక అడాప్టోజెన్. ఇది శరీర పరిస్థితులకు అనుగుణంగా ఒత్తిడిని ఎదుర్కోనేందుకు సహయపడుతుంది. అలాగే కార్టిసాల్‏ను తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

మెగ్నీషియం:

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో మెగ్నీషియం స్థాయులు క్షీణించవచ్చు. దీంతోపాటు మెగ్నీషియం లోపం సమస్య ఉంటే, ఒత్తిడిని పెంచే హార్మోన్లు శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ పోషకం అధికంగా లభించే ఆకుకూరలు, నట్స్, సీడ్స్, చిక్కుళ్లు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలుఅరటిపండులో ఉండే క్యాలరీలు, మెగ్నీషియం ఒత్తిడిని సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అరటిపండు తోడ్పడుతుంది. ఆలుగడ్డలులో జింక్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి వ్యాధుల రాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆప్రికాట్‌లోని కెరోటిన్‌, పెరుగులోని విటమిన్‌ బి ఒత్తిడిని దూరం చేస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి రోజూ వ్యాయామం చేయాలి. అలాగే నీరు ఎక్కువగా త్రాగాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR