Home Health మౌత్ వాష్ తరచుగా ఉపయోగించడం డయాబెటిస్ రిస్క్ పెంచుతుందా ?

మౌత్ వాష్ తరచుగా ఉపయోగించడం డయాబెటిస్ రిస్క్ పెంచుతుందా ?

0

పొద్దున బ్రష్ చేయడంతో పాటు తిన్న తరువాత మౌత్ వాష్ తో నోటిని వాష్ చేసుకోవడం చాలామందికి అలవాటు. దంత పరిశుభ్రతను కాపాడుకోవటానికి మౌత్ వాష్ను ఉపయోగించడం రోజువారీ జీవితంలో భాగమైపోయింది.అయితే మౌత్ వాష్ తో మరింత జాగ్రత్తగా ఉండాలి. మౌత్ వాష్ ను తరచుగా ఉపయోగించడం వలన మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు నివేదించాయి.

Frequent use of mouthwashఅందుకే నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి మౌత్ వాష్‌లు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక మౌత్వాష్ ఉత్పత్తులు హెక్సిడైన్, సిటీలపైటిడినియం క్లోరైడ్, ట్రిక్లోసెన్, ఫ్లోరైడ్పె రాక్సైడ్ వంటి యాంటీ బాక్టీరియల్ పదార్ధాలను కలిగి ఉంటాయి. ఈ పదార్థాలు చిగుళ్ళు మరియు దంత క్షయం యొక్క వాపును కలిగించే బాక్టీరియాను చంపడానికి పని చేస్తాయి.

మరోవైపు, ఈ రసాయన సమ్మేళనాలు నోటిలోని మంచి బాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి. ఇవి నైట్రిక్ మోనాక్సైడ్ (NO) ను ఏర్పరచడం చాలా ముఖ్యమైనవి. శరీరంలో, నైట్రిక్ మోనాక్సైడ్ ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. నోటిలోని మంచి బ్యాక్టీరియా ఆపివేయబడినప్పుడు, ఇన్సులిన్ ను ఉత్పత్తిని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత మధుమేహం అభివృద్ధికి ఒక ప్రమాద కారకంగా చెప్పవచ్చు.

రోజుకు రెండు సార్లు మౌత్ వాష్‌లను వాడటం వలన 50శాతం డయాబెటిస్, ఒకసారి వాడే‌వారికి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. నోటీలోని చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నాశనమవటం వలన డయాబెటిస్ తోపాటు ఒబిసిటిలు వస్తాయని అమెరికా పరిశోధన సంస్థ తెలిపింది.

అందుకే వీలైనంత వరకు మౌత్ వాష్ ల వాడకాన్ని తగ్గించాలి. బదులుగా భోజనం తరువాత కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వలన నోరు, దంతాలు శుభ్రమవుతాయి. ఇలా చేయడం వలన నోటిలోని వేడిపుళ్లు కూడా తగ్గుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 

Exit mobile version