దానిమ్మ పువ్వులంటే గణపతికి ఇష్టమట!

పెద్ద పొట్ట, గజ ముఖంతో బొద్దుగా పూజింపబడే గణేశుడు చెడు మరియు పాప విమోచనం చేసే స్నేహపూర్వక దేవునిగా భావిస్తారు. అపురూపమైన శరీరం కలిగిన గణేశుడిని కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఇతర మతాలు వారు కూడా పూజిస్తారు. గణేశుడు దేవుళ్ళకు అధిపతి అయినందన ఆధి గణపతి అని పిలుస్తారు.

lord ganeshబుధవారం ఆ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.
వినాయకుడికి ప్రీతికరమైన బుధవారం రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

lord ganeshఅనుకున్న కోరికలు నెరవేరాలంటే ఆ వినాయకుడికి పత్రపూజ చేయటం వల్ల అనుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి. అయితే వినాయకుడికి పూజ చేసేటప్పుడు 21 పత్రాలను సమర్పించాలి.

వినాయకుడికి ఎంతో ఇష్టమైన సంకష్టహర చతుర్దశి, వినాయక చతుర్థి, బుధవారం ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయటం వల్ల శుభ ఫలితాలు జరుగుతాయి. మన జీవితంలో ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోవాలంటే ముఖ్యంగా వినాయకుడికి ఈ మూడు రోజులలో ఒక రోజు 21 విష్ణు వర్ధిని పత్రాలతో వినాయకుడికి పూజ చేయటం వల్ల పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది.

patraఅదేవిధంగా దేవదారు ఆకులతో వినాయకుడిని పూజిస్తే మనోధైర్యం చేకూరుతుంది. వినాయకుడికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. ఈ విధంగా వినాయకుడికి గరికతో పూజ చేయటంవల్ల ప్రీతి చెంది గర్భస్థ పెరిగే శిశువుకు రక్షణ కల్పిస్తాడు. పుట్టబోయే బిడ్డకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం లభిస్తాయి.

garikaమనకు సకల సౌభాగ్యాలు కలగాలంటే వినాయకుడికి 21 బిల్వదళాలతో పూజ చేయాలి. అదేవిధంగా దానిమ్మ పువ్వులంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం.
దానిమ్మ పువ్వులతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

pomegranate flowersఎర్రటి మందారాలతో వినాయకుడికి సంకష్టహర చతుర్దశి రోజు పూజ చేయటం వల్ల ఈతిబాధలు, సమస్త దోషాలు తొలగిపోతాయి . అయితే ఎలాంటి పరిస్థితులలో కూడా వినాయకుడికి తులసి ఆకులతో మాత్రం పూజ చేయకూడదు.

red mandaramపురాణాల ప్రకారం తులసికి, వినాయకుడికి మధ్య జరిగిన గొడవ కారణంగా తులసి ఆకులతో వినాయకుడికి పూజ చేయటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయనీ పండితులు తెలియజేస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR