Ganga Mottamodhatiga Nela medhaku digina pavithrakshetram Gangotri

0
3020

మన దేశంలో ఉన్న నదులన్నింటిలో గంగ నది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్ఛతకు నిదర్శనం. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది. ఈ నది విష్ణు భగవానుడి పాదముల నుండి ఉత్బవించింది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా గంగ ఉద్బవించింది. మరి ఉత్తర కాశి అని పిలిచే ఈ గంగోత్రిలో ఉన్న విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. gangotriఉత్తరాంచల్ రాష్ట్రం లో కొన్ని పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అందుకే దీనిని దేవభూమి అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలోని ఘర్ వాల్ ప్రాంతంలో నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి గంగోత్రి, కేదార్ నాథ్, బదరీనాధ్, యమునోత్రి . ఈ నాలుగు క్షేత్రాలను కలిపి చార్ ధామ్ అంటారు. ఇక చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగే ప్రదేశం గంగోత్రి. ఈ ప్రముఖ క్షేత్రం ఉత్తరాంచల్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయ పర్వత శ్రేణులలో భగీరథి నది ఒడ్డున ఉంది. gangotriభగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్బవించిన గంగ 18 కీ.మీ. ప్రయాణించి గోముఖం అనే చోట నేల మీదకు దూకుతుంది. గంగోత్రి దగ్గర గంగ నది సుమారు 50 లేక 60 అడుగుల వెడల్పు ఉంటుంది. నిజానికి గంగ మొట్ట మొదటగా నేలమీదకు దిగింది ఈ గంగోత్రి దగ్గరే కానీ కలియుగంలో మానవుల పాపం పెరిగిపోయినా కొద్దీ గంగ మాత కొద్దికొద్దిగా వెనకకు జరుగుతూ పోతుందని ఆలా ఇప్పటికి గోముఖ్ అని పిలువబడే స్థలం వరకు వెనుకకు వెళ్లిందని కలియుగం పూర్తయ్యేవరకు పూర్తిగా కనిపించకుండా పోతుందని పండితులు చెబుతున్నారు. gangotriగోముఖం నుండి ఈ గంగోత్రి వరకు ప్రవహిస్తున్న వచ్చిన ఈ గంగానది ప్రవాహం తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుండి ఈ గంగోత్రి చేరేవరకు ఈ ప్రవాహంలో నీటికి ఎక్కడ మానవ స్పర్శ అంటదు. అందువల్ల రామేశ్వరంలోని రామేశ్వరస్వామికి చేసే నిత్యాభిషేకం ఈ గంగోత్రి నుండి తీసుకువచ్చిన నీటితోనే చేస్తారు. ఇక స్నానఘట్టాలకు పైన అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన విధి చివరగా గంగామాత పవిత్ర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మొదటగా అమరసింగ్ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మించాడు. gangotriఈ ఆలయం ప్రక్కన ఉన్న కటకాలతో మూసి ఉన్న గది లాంటి దానిలో ఒక చిన్న రాతివేదిక ఉంది. దీనిని భగీరథ శిల అంటారు. ఈ శిలమీదే భగీరధుడు, గంగను గూర్చి తపస్సు చేసాడని స్థల పురాణం తెలియచేస్తుంది. ఈ ఆలయాన్ని దీపావళి మర్నాడు మూసివేసి తిరిగి అక్షయతృతీయ నాడు తెరుస్తారు. ఈ గంగామాత దర్శనం పాపహరణం అని భక్తులు తలుస్తారు.gangotri