గంగపాయిలు ఆకులోని పోషకాలు వలన కలిగే ప్రయోజనాలు

గంగవాయిలు లేక గంగపాయులు మొక్కను దాదాపుగా అందరు చూసే ఉంటారు. ఈ మొక్క ఎక్కువగా పల్లెటూరులో మరియు పొలాల గట్ల మధ్య ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇది నెల మీద పాకుతుంది. అన్ని రకాల నేలలలో ఈ ఆకుకూర పెరుగుతుంది. ఆకులు చాలా దళసరిగా ఉండి పసుపు పచ్చని పూలు పూస్తాయి. ఈ ఆకు కూరని గంగ పాయ, గోళీ కూర అని కూడా పిలుస్తారు. ఇందులో సన్ పాయల, పుల్ల పాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల అని నాలుగు రకాలు ఉన్నాయి.

గంగపాయిలు ఆకుపుల్లగా ఉండే ఈ కూరతో కూర,పప్పు చేసుకుంటారు. గంగ పాయిల ఆకు కూరతో పులుసు, కూర చేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఆకులని, కాదలని నానబెట్టిన పచ్చి పెసర పప్పుతోను, కొబ్బరి తురుము తోను తినవచ్చు. రుచికి కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ఈ ఆకు ని విరివిగా వాడుతారు. గంగ పాయల కూర చాలా సులభంగా పెరుగుతుంది. పెద్దగా సంరక్షణ చేయవలసిన అవసరం లేదు. ఈ ఆకులో చాలా పోషకాలు ఉన్నాయి. గంగపాయులు ఆకు కూరలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువని మలేషియాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

గంగపాయిలు ఆకుఈ పోషకాల గురించి తెలుసుకుంటే ఈ కూరను చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక ప్రీరాడికల్స్ ను అరికడతాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి. ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, సి, నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా దొరకుతాయి. ఇందులో ఏ, బీ విటమిన్లు ఉన్నాయి. పాల కంటే, వెన్న కంటే కూడా ఎక్కువ జీవ శక్తిని ఇస్తుంది.

గంగపాయిలు ఆకుదీనిని పచ్చి కూరగానే వాడటం చాల మంచిది. ఇది దంతాలకు, ఎముకలకు పుష్టి నిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. రక్తంలోని పులుపుని విరిచి రక్త శుద్ధి చేసే గుణం ఉంది. శరీరంలోని చేదు పదార్ధాలను తొలగిస్తుంది. క్షారశిల అను మూల పదార్ధము ఈ కూర ద్వారా మనకు అందుతుంది. ఎముకలు, నోటి పండ్లు పెరుగుటకు క్షారశిల ముఖ్యమైన మూల పదార్దము. తల వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి అవసరమైన అన్ని పోషకాలు గంగ పాయల కూరలో ఉన్నాయి.

గంగపాయిలు ఆకుఈ మొక్క లో ఒమేగా ౩ ఫాటి ఆమ్లాలు ఉంటాయి. ఈ గంగ పాయల ఆకులు తినడం వల్ల ఇందులో ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు ఉండడం వల్ల మన శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది రక్త ప్రహవానికి అడ్డు వచ్చే కొలెస్ట్రాల్ ను తీసి వేస్తుంది. తద్వారా గుండెకు మేలు చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తరచూ ఈ ఆకులు ఏదో విధంగా తినడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు.

గంగపాయిలు ఆకుగంగ పాయిల్ల మొక్కలో మొక్కలో జింక్ అధికంగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. ఇందులో కాల్షియం ,పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఏముకలు దృడంగా ఉండేలాగా చేస్తుంది. గంగ పాయల కూరలో తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు పదార్ధం ఉండుట వలన బరువు తగ్గాలని అనుకునేవారికి మంచి కూర అని చెప్పవచ్చు. గంగ పాయల కూరలో పీచు సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరిస్తుంది. దాంతో మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. గంగ పాయల కూరలో ఐరన్,కాఫర్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో రక్త కణాల సంఖ్యను పెంచటంలో సహాయపడతాయి. రక్తహీనత సమస్యతో ఉన్నవారు తరచుగా ఈ కూరను తింటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. అన్ని ఆకుకూరల్లో కన్నా ఈ గంగ పాయల ఆకుల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండుట వల్ల కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాక చర్మంపై ఏర్పడే ముడతలు,నల్లని మచ్చలు,చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR