Home Unknown facts Garuda Sthupam Akarshanaga unde Dantheshwari Devalayam

Garuda Sthupam Akarshanaga unde Dantheshwari Devalayam

0

సతీదేవి యొక్క 51 శక్తి పీఠాలలో ఇది ఒకటిగా చెబుతారు. అమ్మవారు దంతేశ్వరి గా పూజలందుకొంటున్న ఈ పురాతన ఆలయంలో గరుడ స్థూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది. మరి అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. garuda sthupam
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం దంతేశ్వరి దేవాలయం. ఈ ఆలయం చాలా పురాతమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని దంతేశ్వరి దేవిగా పిలుస్తారు. ఈ అమ్మవారు 51 శక్తి పీఠాలలో ఒకరుగా పేర్కొనబడింది. ఈ ఆలయం చాణుక్యులచే 14 వ శతాబ్దంలో శాంకిని, డాంకీని పవిత్ర నదుల సంగమంలో నిర్మించబడింది. ఇలా ఇక్కడ దంతేశ్వరి దేవిగా పూజలనందుకొంటున్న ఈ అమ్మవారి పేరుమీదుగానే ఈ గ్రామముకు దంతెవాడ అనే పేరు ఏర్పడినది. ఈ దంతేశ్వరిదేవి కాకతీయులకు ఆరాధ్య దేవత. ఇంకా పురాణం ప్రకారం ఇక్కడ సతీదేవి యొక్క పన్ను పడిన ప్రదేశంగా చెబుతారు. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఒక నల్లని రాతి శిలాతో చెక్కబడినది. ఈ ఆలయంలో గర్భాలయం, మహా మంటపము, ముఖ్య మండపము, సభా మండపములు కనిపిస్తాయి. గర్భాలయం చిన్న చిన్న రాళ్లతో నిర్మితమైనది. ఈ ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న గరుడ స్థూపం ఆలయమునకు ఆకర్షణగా నిలిచినది. ఇది ఒక ప్రత్యేకతని కలిగి ఉంటుంది. ఇలా కొలువై ఉన్న ఈ అమ్మవారికి దసరా నవరాత్రుల సమయంలో ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చి నవరాత్రులలో అమ్మవారిని దర్శించి తరిస్తారు.

Exit mobile version