అమ్మవారి శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, ఇక్కడ అమ్మవారు వివాహాం కోసం ఎదురు చూస్తూ కన్యగానే వెలిశారని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు అమ్మవారు కన్యగా వెలిశారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలో నాగర్ కోయిల్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం ఉంది. ఈ ఆలయం మూడు సముద్రాలు కలసిన సంగమ ప్రదేశంలో ఉండటం ఒక విశేషం. ఇక్కడి విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడి అమ్మవారికి వివాహం కాకుండా కన్యగా ఉన్న కారణం వలన ఈ అమ్మవారిని కన్యకా అమ్మవారు అని భక్తులు పిలుస్తారు.
పురాణం విషయానికి వస్తే, వీరబలగర్వముతో చెలరేగిన దుష్ట బాణాసురిని వధించుటకు పార్వతీదేవి ఈ అవతారం దాల్చిందని చెబుతారు. ఇక అమ్మవారు రాక్షసుడ్ని అంతం చేసిన తరువాత వివాహ ముహూర్తం ముగిసిపోవడం, ఆ సమయానికి శివుడూ యోగ సమాధిలోకి వెళ్లడంతో శివుడు యోగనిష్ఠలో అలానే ఉండిపోగా, పార్వతీదేవి అలానే కన్యగానే మిగిలిపోయింది.
ఇక ఆలయ విషయానికి వస్తే, ఆలయంలో అమ్మవారి విగ్రహం బహుసుందరంగా ఉంటుంది. అయితే పెళ్లికోసం చేసిన పిండివంటలు మొదలైనవన్నీ చిన్న చిన్న రాళ్లు, గవ్వలతో నిండి ఉండటానికి కారణం అంటారు. అయితే అన్నాడు కన్యక తపసు చేసిన సముద్రతీరంలో ని చిన్న దీవిలాంటి రాతిపై ఆ తరువాతి కాలంలో స్వామి వివేకానంద కొన్ని రోజుల పాటు తపస్సు చేసాడని చెబుతారు.
ఈవిధంగా వెలసిన ఈ ఆలయంలో వైశాఖ మాసంలో, నవరాత్రి సమయంలో ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు