గోధుమ రవ్వ… బెస్ట్ బ్రేక్ ఫాస్ట్!

  • ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సరైన పోషకాలున్న ఆహరం తీసుకోకపోవడం, తీసుకునే ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోకపోవడం కూడా ఈ సమస్యకు దారితీస్తోంది. ఆ తరువాత శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ఫీట్స్ చేస్తుంటారు. గంటలకొద్దీ వ్యాయామం, డైటింగ్, వేళకు తినకుండా కడుపుమాడ్చుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గించుకోవాలంటే ఆహారం మానేయకూడదు. పోషకాలుండి బరువు తగ్గించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యంగానూ జీవించవచ్చు.
1
  • కానీ నేటి ఉరుకుల పరుగుల జీవనంలో కడుపునిండా తినడానికి కూడా సమయం లేదు. ఇంట్లో వర్కింగ్ విమెన్ ఉంది అంటే ఇక టిఫిన్ తయారుచేసుకోవడానికి కూడా వీలుపడట్లేదు. సమయం సరిపోదు. అందుకే బయట టిఫిన్ సెంటర్ లకు అంత డిమాండ్ పెరిగిపోతుంది. అయితే ఇంట్లో చాలా తక్కువ సమయంలో రుచిగా చేసుకొని తినగలిగిన బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మా ఒకటి. ఉప్మా చేసుకోవడానికి చాల తక్కువ సమయం పడుతుంది. గోధుమ రవ్వ లేదా ఉప్మా రవ్వ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. చవకగా సామాన్యుడికి అందుబాటులో కూడా ఉంటుంది. కానీ కొందరు ఉప్మా తినడానికి ఇష్టపడరు.
2
  • అయితే ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది సత్యం. అందులోనూ  గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఆరోగ్యానికి ఇంకా మంచిది.  ఉప్మాయే కాదు.. గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా మనకు మంచి పోషకాహారం లభించినట్లే.. గోధుమ రవ్వతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా గోధుమ రవ్వతో చేసిన స్వీట్లు చాలా రుచిగా ఉండడమే కాదు ఎన్నో పోషకాలు అందిస్తాయి.
  • గోధుమల ద్వారా తీసిన ఈ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గేందుకు పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. గోధుమ రవ్వ తో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల చాలా సేపు ఆకలి వేయదు. కాబట్టి గోధుమరవ్వను డైట్లో చేర్చుకుంటే.. త్వరగా బరువు తగ్గవచ్చు. స్నాక్స్ బదులు రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
3
  • జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగడానికి చేసిన ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే గోధుమ రవ్వ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీవక్రియ వేగంగా జరగటం వల్ల క్యాలోరీలు ఎక్కువగా ఖర్చై, శరీర బరువు తగ్గుతుందని చాలామంది భావిస్తారు. కానీ వేగంగా జీవక్రియ జరగటం వల్ల త్వరగా ఆకలి కలిగి, ఎక్కువ క్యాలోరీలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి బరువు పెరుగుతారు. గోధుమ రవ్వ తినటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీనివల్ల ఆకలి కలుగదు. ఉప్మా తీసుకోవడం వల్ల శరీర సామర్థ్యం పెరిగి మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని నివారించడంలో ఇది ఔషధంలా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.
  • మనం తీసుకున్నఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుంది. ఇది  రక్తం లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అదుపుచేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు మీ రోజువారీ ఆహారం లో  గోధుమ రవ్వను చేర్చుకోవడం వలన మంచి రిసల్ట్ ఉంటుంది. గోధుమ రవ్వలో ప్రొటీన్లు అధికం. కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. పైగా  గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. రవ్వ ఉప్మా తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఫలితంగా జంక్ ఫుడ్ తినాలనే ఆసక్తి మైండ్‌లోకి కూడా రాదు.
4

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR