గుడివెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా?

మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. భిన్న సంస్కృతులు ఉంటాయి. ముక్యంగా హిందూ సంప్రదాయంలో ప్రతీది పూజించబడేదే. చెట్టు, పుట్ట, రాయి, రప్ప, నదులు, సరసులు, ప్రకృతి లో ఉండే అన్నింటిని పూజిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తారు ఇలాంటి ఆచారాల వల్లే ప్రపంచ దేశాలు మన దేశాన్ని గౌరవిస్తాయి. అయితే మన ఆలయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తికి, ప్రశాంతతకు నిలయంలా ఉంటాయి, ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

గర్భగుడిచిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎవ్వరైనా గుడికి వెళ్తే భక్తితో దేవుడికి నమస్కరిస్తారు. ఆ విషయం అందరికి తెలిసిందే. సాధారణంగా భక్తులు తరుచుగా గుడికి వెళ్తుంటారు. గుడిలో ధ్వజస్తంభం దగ్గర నుంచి గుడివెనుకగా ప్రదక్షణం చేస్తారు. గుడిలో ఉన్న చిన్న చిన్న ఉపాలయాలను కూడా దర్శించుకుంటారు. అయితే ఆ సమయంలో గుడివెనుక చాలామంది మొక్కుకుంటుంటారు దీనివెనుక విశేషం తెలుసుకుందాం.

గర్భగుడిగుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరు ఆచరిస్తారు. అయితే.. దానివెనకున్న రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఏదో ప్రాచీనకాలం నుంచి అలా నడుస్తూ వస్తోంది కాబట్టి.. ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్లిపోతారు. ఇంకొందిమంది.. మంచి జరుగుతుందని అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అంతే తప్ప.. దానివెనకున్న రహస్యం మాత్రం తెలియదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం వుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

గర్భగుడిగుడిలో మూలవిరాట్టు వుండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా, వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్ర శక్తి వల్లే భగవత్ విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపుగోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్సక్తిని పొందడానికి వీలుగా వుంటుంది.

గర్భగుడిదేవాలయానికి గర్భగుడి ప్రధానమైనది. గర్భగుడినే మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్ని కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఆగమసూత్రాలను అనుసరించి నిర్మించబడిఉంటాయ. ప్రతి ఆలయంలోను విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ఈ రెండింటికి ఎప్పుడు ఒక నిర్ణీత సంబంధం వుండటంవల్లనే గర్భగుడి లోపల ప్రణవమంత్రం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ప్రణవమంత్రమైన ఓంకారాన్ని ఉచ్ఛరించినపుడు ప్రతిధ్వని ఏర్పడుతుంది.

గర్భగుడిలోకం లోని ఉత్తమ ద్రవ్యాలతో నిండిన గర్భ పాత్రను విధి విధానంతో దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికాది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు అందుకే తెలిసిన వాళ్ళు గుడి వెనుక వైపు గర్భాలయం వెనుక కొంచం సేపు నిలబడతారు. అక్కడ గర్భాలయం నుండి తాకే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని బలంగా నమ్ముతారు.

గర్భగుడిదేహాన్ని ఉదాహరణకు తీసుకుంటే దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చర దేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి గుడికి – ఈ గుడికి అదే తేడా ఇక్కడ భగవంతుడు ‘స్వయంభూ ‘ అన్నమాట. “దేహం దేవాలయం” అయితే, “హృదయం గర్భగుడి” అవుతుంది, జీవుడు దేవుడౌతాడు

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR