Gudilo theertam teesukunnaka ila cheyakudadhu

0
3883

ఆలయంలోకి వెళ్లి దేవతామూర్తులను దర్శించుకున్న తర్వాత పూజారి మనకి తీర్ధ ప్రసాదాన్ని అందిస్తారు. 1 Teertham Waterఎంతో పవిత్రమైన తీర్ధాన్నీ చేతిని గోకర్ణభంగిమలో ఉంచి తీసుకుంటాము. అలా తీసుకోవడం ఉత్తమం. ఆ తీర్ధాన్నీ తాగిన తర్వాత చాలామంది చేయి అనాలోచితంగా తలపై వెళుతుంది. మిగిలిన తీర్ధాన్నీ తలకి రాసుకుంటారు. ఆ విధంగా చేయకూడదు. తీర్ధం పంచామృతంతో చేస్తారు. అందులో తేనె, పంచదార వంటివి జుట్టుకి మంచివి కావు. అలాగే తులసీ తీర్ధం తీసుకున్నా తలపై రాసుకోకూడదు. తీర్ధం తీసుకోవటం వల్ల చేయి ఎంగిలి అవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు.3 Teertham Water