Home Health చిన్నపిల్లలకు జుట్టు రాలిపోతుందా? ఈ చిట్కాలు మీకోసమే!

చిన్నపిల్లలకు జుట్టు రాలిపోతుందా? ఈ చిట్కాలు మీకోసమే!

0

సహజంగా చిన్న పిల్లలలో హెయిర్ లాస్ ప్రాబ్లమ్ అంతగా ఉండదు. కానీ మారుతున్నా జీవనశైలి కారణంగా ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. కొంత మంది పిల్లల్లో హెయిర్ గ్రోత్ తక్కువగా ఉంటుంది, చిన్న వయసులోనే జుట్టు ఊడే సమస్యని కూడా ఎదుర్కుంటున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉండవచ్చు. ఇంఫెక్షన్స్, జ్వరం, జీన్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ వంటి కారణాలు ఉన్నాయి.

Hair loss in young children? These tips are for youఅంతేకాదు హార్ష్ కెమికల్స్ ఉన్న హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం, తడి జుట్టుని చిక్కు తీసి దువ్వడం, బ్లో డ్రైయింగ్, స్ట్రెయిటనింగ్ చేసేటప్పుడు హై-హీట్ ట్రీట్మెంట్స్ ఉపయోగించడం, పోనీ టెయిల్స్, జడ వేసేటప్పుడు బాగా గట్టిగా వేయడం, బాగా గట్టిగా దువ్వడం వల్ల జుట్టు లాగినట్లుగా అవ్వడం వంటివి కూడా జుట్టు ఊడిపోవడానికి కారణాలుగా ఉన్నాయి.

కొన్ని హెయిర్ కేర్ టిప్స్ పాటించడం ద్వారా ఈ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టవచ్చు. జుట్టు ఒత్తుగా ఉన్నా, పల్చగా ఉన్నా, ఊడుతున్నా, ఊడకున్నా ఒక మంచి హెయిర్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వడం చాలా అవసరం. వారానికి రెండు మూడు సార్లు నాచురల్, కెమికల్ ఫ్రీ షాంపూతో తలస్నానం చేయించండి. చల్ల నీరు, లేదా గోరు వెచ్చని నీరు మాత్రమే వాడండి. మంచి హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా జుట్టు మాయిశ్చరైజ్డ్ గా ఉండేటట్లు చూడండి.

అలో వెరా జెల్ స్కాల్ప్ కి పట్టించి కొద్ది గంటల తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయించండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. లేదా రెండు కప్పుల కోకోనట్ ఆయిల్ లో ఏడెనిమిది మందారాకులు, కొన్ని మందార పూలు వేసి రంగు మారేవరకూ వేడి చేయండి. వడకట్టి చల్లారనివ్వండి. ఈ నూనె తో రాత్రి మసాజ్ చేసి మర్నాడు పొద్దున్న హెయిర్ వాష్ చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు.

 

Exit mobile version