సీతాఫలంతో హెయిర్ ప్యాక్స్! ఎప్పుడైనా ట్రై చేసారా?

సీజన్‌ వస్తోందంటే చాలు… కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతుంది సీతాఫలం. అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి.

custard appleసీతాఫలంలో మన శరీరంలోని విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎంతో మేలు చేసే విటమిన్ C ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటివి గుండెకు మేలు చేస్తాయి. బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. ఈ పండ్లలోని విటమిన్ A… చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపు కూడా మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే… జీర్ణక్రియ బాగా అవుతుంది. ఈ ఫలంలోని కాపర్… మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది.

Hair Growth Tipsజుట్టు ఒత్తుగా పెరగాలని ఆశపడే మహిళలు చక్కగా సీతాఫలం పండ్లను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. చుండ్రును తగ్గించడం నుంచి పేలను దూరం చేయడం వరకూ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది సీతాఫలం. మరి, ఈ ప్రయోజనాలను అందేందుకు వీటిని కేవలం తినడం మాత్రమే కాదు.. హెయిర్ ప్యాక్స్‌గానూ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.

custard appleసీతాఫలం పైనున్న తొక్కను తీసి మిక్సీలో వేసి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. తర్వాత అందులో మీ జుట్టు పొట్టిదైతే ఒక టేబుల్ స్పూన్.. పెద్దదైతే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు అప్లై చేసుకోని, ఓ గంట పాటు ఉంచుకొని తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు తలకు నూనెను పట్టించి తలస్నానం చేయడం వల్ల.. కొద్దిరోజుల్లోనే చుండ్రు తొలగిపోతుంది. సీతాఫలం తిన్న తర్వాత.. మిగిలిన తొక్కలతోనే ఈ ప్యాక్ వేసుకుంటాం కాబట్టి.. వృథా కూడా ఏమీ ఉండదు. పైగా దీనివల్ల జుట్టులో తేమ పెరుగుతుంది.

custard appleసీతాఫలం కేవలం జుట్టుకే కాదు.. చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. సీతాఫలం గుజ్జుతో నిమ్మరసం గాని, పసుపు గాని కలుపుకొని పేస్ ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్
చేయడమే కాకుండా చర్మంపై మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తుంది.

custard apple

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR