దుర్వాస మహర్షి ఎవరు? అయన తన భార్యని ఏమని శపిస్తాడు ?

దుర్వాస మహర్షి చాలా ముక్కోపి. తనకి ఎవరైనా కోపం తెప్పిస్తే శపిస్తాడు. అందుకే అయన ఎక్కడికి వెళ్లిన భక్తి శ్రద్దలతో పూజిస్తారు. మరి దుర్వాస మహర్షి ఎవరు? అయన తన భార్యని ఏమని శపించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Maharshi

ఇక పురాణానికి వస్తే, అనసూయాదేవి పరమ సాద్వి, ఆదర్శ ప్రతివ్రత. ఆమెని పరీక్షించేందుకు వచ్చిన త్రిమూర్తులు ఆమెను దిగంబరంగా ఉండి తమకు బిక్ష ఇవ్వమని అడుగగా అందుకు అంగీకరించి, ఆమె ప్రతివత్య మహిమతో వారిని పసిపాపలుగా మర్చి వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసింది. ఇంతలో విషయం తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు ముగ్గురు వచ్చి, అనసూయని ప్రార్ధించి తమ తమ భర్తలను పొందారు. అప్పుడు అత్రి, అనసూయ కోరికను మన్నించి త్రిమూర్తులు వారికీ కొడుకులుగా జన్మించారు. అందులో బ్రహ్మ అంశ చంద్రుడు, విష్ణువు అంశ దత్తాత్రేయుడు, రుద్రంశ దుర్వాస మహర్షిగా గా చెబుతారు.

Durvasa Maharshi

అయితే దుర్వాస మహర్షి తపస్సులో ఉన్నప్పుడు అయన ఉన్న ప్రదేశానికి బలిచక్రవర్తి కుమారుడైన సాహసికుడు ఒక అప్సరసతో రాగ వారి నవ్వుల, కేరింతల వలన దుర్వాస మహర్షికి తపోభంగం కలగడం వలన వారిని రాక్షసులుగా జన్మించాడు అని శపిస్తాడు. వారు శాపవిమోచనం చెప్పమని ప్రార్ధించగా, సాహసిక నీవు శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తావు, తిలోత్తమ బాణాసురుని ఇంట ఉషగా జన్మిస్తావు అని చెబుతాడు. ఆ తరువాత దుర్వాస మహర్షి  ఔర్య మహర్షి దగ్గరికి వెళ్లి తన కూతురిని వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు  ఔర్యుడు కుమార్తె అయినా కందళిని అనే అమ్మాయి తో వివాహం జరుగుతుంది.

Durvasa Maharshi

దుర్వాస మహర్షి ఒక రోజు గాఢ నిద్రలోకి వెళ్లగా సాయంసంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందని గ్రహించిన ఆమె ఆదమరచి నిద్రిస్తున్న దుర్వాస మహర్షిని తట్టి లేపింది. అప్పుడు కోపిష్టి అయిన దుర్వాస మహర్షి నిద్ర భంగం కలిగిందని కోపంతో కళ్ళు తెరిచి భార్యని చూడగా, కంటి నుండి అగ్ని రావడంతో ఆమె భస్మం అయిపోతుంది. ఆ తరువాత తన తప్పుని తెలుసుకున్న దుర్వాస మహర్షి, తన భార్య పేరు భూమిపైనా శాశ్వతంగా ఉండేలా, భగవంతుడికి ప్రసాదంగా ప్రాణకోటికి ఆరోగ్యాన్ని కలిగించేలా ఉండాలని భావించి, ఆ భస్మం తో ఒక చెట్టుని సృష్టించాడు. అదే కదళీ వృక్షం , అంటే అరటిచెట్టు. ఈవిధంగా తన భార్యకి వరాన్ని ఇచ్చాడు.

Durvasa Maharshi

ఇక తన కూతురిని భస్మం చేసాడని తెలుసుకున్న ఔర్యుడు ఆగ్రహంతో ఒక సామాన్య భక్తుని చేతిలో గోరమైన అవమానాన్ని పొందుతావని శపిస్తాడు. ఈ శాపం కారణంగానే దుర్వాస మహర్షి అంబరీషుని శపించడానికి ప్రయత్నం చేయగా శ్రీమహావిష్ణవుచే మందలింపబడుతాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR