Home Health చిరుధాన్యాల్లో ఊదలు రుచి చూసారా?

చిరుధాన్యాల్లో ఊదలు రుచి చూసారా?

0

ఆరోగ్యకరమైన జీవితంలో చిరు ధాన్యాల పాత్ర చాలా కీలకమైనది. చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమంలో ప్రముఖ పాత్ర పోషించాయి. వర్షాభావ, ఎడారి ప్రాంతంలో ఈ ధాన్యాలు మానవులకు, పశువులకు ముఖ్య ఆహారం. భారతదేశములో జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగెలు ఈనాటికీ వాడుకలో ఉన్నాయి. చిరుధాన్యాలలో కాల్షియమ్, ఇనుము, మెగ్నిషియం, భాస్వరం అనే ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

calcium magnesium and zincచిరుధాన్యాలలో కొవ్వులు తక్కువ శాతంలో ఉండటం వలన రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గి నుంది. అంతేకాక రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మంచి ఆహారం. వీటిలో విటమిన్ బి12, బి17, బి6, కూడా ఎక్కువ శాతం వుంటాయి. ఎక్కువ పీచుపదార్థాలు కలుగివుంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచివి. అంతేకాక చిరుధాన్యాల్లో పిల్లలకు, వృద్దులకు కావలసిన పోషకాలు ఎక్కువగా వుండటంచేత భారతదేశంలో వీటి వాడకం ఎక్కువ.

ఆ చిరు ధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత్, పాకిస్థాన్ , నేపాల్ , జపాన్ , చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్ లో పండించగా.. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు.

రుచికి తియ్యగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహరం మంచి బలవర్ధకమైంది. ఈజీగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఊదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఊదల ఆహారాన్ని ఉత్తరాఖండ్, నేపాల్ లోని గర్భిణీలకు, బాలింతలకు ఎక్కువగా కూడా ఇస్తారు. ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా వుంటటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా వస్తాయని వారు నమ్ముతారు.

ఈ ఆహరం శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో కూడా ఉంచుతుంది. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహరం అన్ని చెప్పుతారు. ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు మరియు పెద్ద ప్రేగులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఊదల ఆహరం కాపాడుతుంది.

కాలేయం, పిత్తాశయం శుభ్రపర్చడానికి సహాయపడుతుంది. నియంత్రిస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం పనికి వస్తాయి.

కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. పెద్ద వారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి. ఊదలు థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచిది.

Exit mobile version