మహావిష్ణువుని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి?

శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం దశావతారాలు ధరించాడు. ఇందులో ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత అనేది ఉన్నది. అయితే త్రిమూర్తులలో ఒకడైన శ్రీ మహావిష్ణుని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అందులో ఒకటి నారాయణుడు. మరి ఈ స్వామిని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి? నారాయణుడు అంటే అర్ధం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Maha Vishnuvuప్రాణికోటి మ‌నుగ‌డ‌కు నీరు అత్యంత ఆవ‌శ్య‌కం. నీరు లేక‌పోతే మ‌నం లేము. అయితే నారాయ‌ణుడు అన్న పేరులో నారము అంటే నీరు అనే అర్థం వ‌స్తుంది. అదేవిధంగా ఆయ‌ణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే స‌మ‌స్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు క‌నుక‌నే విష్ణువుకు నారాయ‌ణుడ‌నే పేరు వ‌చ్చింది. అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భ‌వించిన‌ట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయ‌న్ను నారాయ‌ణుడ‌ని పిలుస్తారు.

Maha Vishnuvuఇవే కాకుండా విష్ణువును నారాయ‌ణుడ‌ని పిల‌వ‌డానికి ఇంకొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే నారదుడు ఎల్ల‌ప్పుడూ నారాయ‌ణ‌, నారాయ‌ణ‌ అంటూ స్మ‌ర‌ణ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విష్ణువును నారాయ‌ణుడని పిల‌వ‌డం మొద‌లుపెట్టార‌ట‌. అదేవిధంగా గంగాన‌ది విష్ణువు పాదాల నుంచి ఉద్భ‌వించ‌డం వ‌ల్ల విష్ణు పాదోదకం అని పేరు వ‌చ్చింద‌ట‌. దీంతోపాటు విష్ణువు ఎల్ల‌ప్పుడూ నీటిలో నివ‌సిస్తాడు కాబ‌ట్టి ఆయ‌న‌కు నారాయ‌ణుడ‌నే పేరు వచ్చిందని చెబుతారు.

Maha Vishnuvuఇంకా నారాయణుడు అంటే పరమాత్మా స్వరూపుడు. భగవత్గిత లో శ్రీకృష్ణుడు అర్జునకు, ఓ అర్జునా నీకు నాకు ఇద్దరికీ శరీరాలు వున్నవి ఇద్దరం కర్మలను చేస్తున్నాము కానీ నేను వీటికి బందీకాను ఎందుకంటే నేను జ్ఞానాన్ని కలిగివున్నాను కాని నువ్వు అజ్ఞానంలో వున్నావు ఆ అజ్ఞానంతో నువ్వు చేసే కర్మలకు నేను చేస్తున్నాను  అనే అహంకారంతో నీ పైన వేసుకొని బందీ అవుతున్నావు. కావున నీవు జ్ఞానివై యోగివై, నీవు చేసే కర్మలు నిష్కల్మషంగా, లోక కల్యానార్ధంగా, ఫలాశక్తిరహితుడవై, నీవు చేసే ప్రతి పని నాకు సమర్పించి నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు అర్జునా అని చెప్పాడు. అంటే ఇద్దరు శరీరాలను కలిగి వున్నారు, ఇద్దరి శరీరాలను వుత్తేజపరిచే ఆత్మ కూడ ఒకటే కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమాత్ముడు అయ్యాడు అదే అర్జునుడు నరుడయ్యాడు ఎందుకంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు కానీ శ్రీ కృష్ణుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అదియే భేదం. అందుకే వీరిని నర నారాయణులు అని కూడ అంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR