బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా ?

మనలో చాలామంది తీపి అంటే పంచదారనే ఎక్కువ వాడటం చూస్తుంటాం…. అయితే పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎందుకంటే బెల్లం తీపి మాత్రమే కాదు ఒక ఔషదం.. అవును బెల్లం మన ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తుంది.. మరి బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..

Health Benefits of bellamబెల్లం మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చేస్తుంది.. అందుకే బెల్లం తినడం ఎంతో అవసరం. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన కండరాల నిర్మాణం, శరీరంలో మెటాబాలిజం క్రమపద్ధతిలో ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతూ… ఒంట్లో ఉండే అధిక నీరు కూడా బయటకు వెళ్ళేలా చేస్తుంది.

Health Benefits of bellamబెల్లం తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసాక ఒక ముక్క బెల్లం తినడం వలన అసిడిటీ, గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. ఇలా రక్తాన్ని పరిశుభ్రంగా ఉంచినపుడు ఎన్నో రకాల వ్యాధులు శరీరానికి దరిచేరవు. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. ఆస్తమా ఉన్నవారు బెల్లంలో ఉన్న యాంటి ఎలర్జిక్ తత్వాల కారణంగా, ఇది తింటే మంచి ఫలితాలను పొందుతారు.

Health Benefits of bellamబెల్లం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.. బెల్లం డైలీ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలానే బెల్లం తింటే గొంతు నొప్పి, గర గర తగ్గి మాట సాఫీగా వస్తుంది. చలికాలంలో బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే, ఆస్తమా ఇబ్బందులు ఉండవు. ఈ బెల్లం, చెవి నొప్పికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నెయ్యితో బెల్లం కలిపి ఒకసారి తిని చూడండి.. చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.బెల్లంలో ఉండే ఇనుము, అనిమియా రోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. బెల్లం ఆరోగ్యాన్నే కాదు సౌందర్యన్నీ పెంచటంలోనూ తోడ్పడుతుంది..

Health Benefits of bellamబెల్లంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి… ఇవి ఫ్రీ ర్యాడికల్స్ పై పోరాడి యాంటీ ఏజింగ్ ల పనిచేస్తాయి.. . బెల్లం ముఖం పైన వచ్చే డార్క్ స్పాట్స్ మరియు బ్లేమిషెస్ ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్ సి, ఐరన్ హెయిర్ గ్రోత్ కి తోడ్పడుతుంది.. బెల్లంలో దొరికే గ్లైకోలిక్ యాసిడ్ చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. బెల్లంలో లభించే విటమిన్ సి అనేది హెయిర్ ను స్మూత్ గా, సిల్కీగా అలానే దృఢంగా మారుస్తుంది.. ఇన్ని మంచి గుణాలున్న బెల్లాన్ని మన డైలీ డైట్ లో తీసుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు..

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR