Home Health నల్ల పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

నల్ల పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. కుళ్లిపోతున్న పదార్ధాలున్న చోట ఇవి సహజంగా పెరుగుతుంటాయి. ప్రత్యమ్నాయ మార్గాల్లోనూ వీటిని సాగుచేస్తున్నారు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి.

health benefits of black mushroomsసాధారణంగా మనం పుట్టగొడుగులు అనగానే కొంచెం బూడిద రంగులో ఉండే వాటిని మాత్రమే చూసి ఉంటాము. అయితే నల్ల పుట్టగొడుగులను చాలా మంది చూడకపోయుండవచ్చు. అయితే నల్ల పుట్టగొడుగులను ట్రఫీల్ మష్రూమ్స్ అని అంటారు. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పైకి కందగడ్డ లాగా కనిపించే ఈ పుట్టగొడుగులకు జన్యుపరమైన మార్పులు చేసి, తెలుపు రంగులో కూడా వీటిని పుట్టిస్తారు.

అడవుల్లో మాత్రమే పెరిగే ఈ ట్రఫిల్ మష్రూమ్స్ అరుదైనవి, ఖరీదైనవి కూడా. ఒక్కోటీ 30 నుంచీ 60 గ్రాముల బరువు పెరుగుతుంది. దాని ధర ప్రపంచ మార్కెట్‌లో $30 నుంచీ $100 ఉంటుంది. మన రూపాయల్లో చెప్పాలంటే రూ.2,000 నుంచీ రూ.7000 దాకా ఉంటుంది. అంత రేటెక్కువ ఉన్నా కూడా వాటితో ఉండే ఆరోగ్య ప్రయోజనాలతో పోల్చితే ఆ మాత్రం ధర తప్పదంటున్నారు పరిశోధకులు.

ఈ పుట్టగొడుగల నుంచి నూనెను తీస్తారు. అది ఆలివ్ ఆయిల్ కంటే ఎక్కువ మేలు చేస్తుంది. దాన్ని ట్రఫిల్ ఆయిల్ అని పిలుస్తున్నారు. దాన్ని పాస్తా, పిజ్జాలలో టేస్ట్ కోసం వాడుతుంటారు. అందులోని పాలీఫెనాల్స్‌లో మన శరీరంలోని విష వ్యర్థాలను, చెడు బ్యాక్టీరియాను తొలగించే లక్షణాలున్నాయి. అవి కణాలను కాపాడి ముసలితనం రాకుండా చేస్తాయట.

ట్రఫిల్ పుట్టగొడుగుల్లో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఫైబర్ (పీచు), ఫాట్టీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన 9 అమైనో యాసిడ్లను ఈ పుట్టగొడుగులు ఇవ్వగలవని తేలింది.

ఈ రోజుల్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. అసలు కేన్సరే రాకుండా చేసుకోవాలంటే ఈ పుట్టగొడుగులు (నలుపు లేదా తెలుపు) తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. సెర్వికల్, బ్రెస్ట్, కొలొన్ కేన్సర్ కణాల్ని ఎదుర్కోవడంలో ఈ పుట్టగొడుగులు బాగా పనిచేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది.

ఇవి శరీరంలో మంటలు, నొప్పులు, వాపులను కూడా తగ్గిస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. డయాబెటిస్ కూడా రాకుండా చేస్తాయట.

 

Exit mobile version