Home Health వేసవిలో చెమ‌ట నుండి ఉపశమనం పొందే కొన్ని చిట్కాలు

వేసవిలో చెమ‌ట నుండి ఉపశమనం పొందే కొన్ని చిట్కాలు

0

గ‌త కొద్ది రోజుల నుంచీ ఎండ‌లు మ‌రింత పెరిగాయి. మ‌రో వైపు ఎండ‌లో తిరుగుతున్న చాలా మంది చ‌ల్ల‌గా ఉండ‌డం కోసం శీత‌ల పానీయాలు, ఇత‌ర మార్గాల‌ను అనురిస్తున్నారు. అయితే ఈ ఎండ‌ల్లో చాలా మందిని చెమ‌ట స‌మ‌స్య కూడా ఇబ్బంది పెడుతుంటుంది. ఓ వైపు ఫ్యాన్ లేదా కూల‌ర్ తిరుగుతూ ఉన్న‌ప్ప‌టికీ చెమ‌ట బాగా ప‌డుతుంటుంది. ఒంట్లో అధికంగా ఉన్న వేడిమిని తగ్గించేందుకు, ఒంటికి పడని వ్యర్థాలను బయటికి పంపేందుకు దేహ ధర్మానుసారం చెమట పడుతుంది.

tips to get rid of sweat in summerఅయితే చెమట ఎక్కువగా పట్టడం వలన చర్మం నుండి దుర్వాసన రావడం వంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చెమ‌ట నుంచి కొంతవరకు ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా.

కార్న్ స్టార్చ్‌, బేకింగ్ సోడాల‌ను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. చంకల్లో ఎలాంటి త‌డి లేకుండా చూసుకుని ఆ మిశ్ర‌మాన్ని రాయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

గోధుమ గ‌డ్డి జ్యూస్ తాగ‌డం లేదా పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టి పండ్లు తదిత‌ర ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు.

ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీస్పూన్ల వెనిగ‌ర్‌, 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లిపి తాగితే చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

నిత్యం ఏదైనా ఒక స‌మ‌యంలో 1 గ్లాస్ ట‌మాటా జ్యూస్‌ను తాగినా అధికంగా చెమ‌ట ప‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు.

 

Exit mobile version